ఓ సాధువు తాను బిక్షాటన చేస్తూ వచ్చిన సొమ్మును దైవ సేవకు దానం చేసి పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. యాదిరెడ్డి అనే సాధువు విజ‌య‌వాడ ముత్యాలంపాడు షిర్డీ సాయిబాబా మందిరం వ‌ద్ద నిత్యం బిక్షాట‌న చేస్తుంటారు. తెలంగాణకు చెందిన యాదిరెడ్డి త‌న చిన్న వ‌య‌స్సులోనే విజ‌య‌వాడ‌కు వ‌చ్చేశారు. అప్పటి నుండి రైల్వే స్టేష‌న్ లో ఉంటూ జీవ‌నం సాగించాడు. మొద‌ట్లో రిక్షా తొక్కి జీవ‌న‌ం సాగించేవాడు. ఆ త‌రువాత వ‌య‌సు మీద ప‌డ‌టంతో బిక్షాట‌న సాగించ‌టం మెద‌లు పెట్టాడు. అలా వ‌చ్చిన సొమ్మును తిరిగి దేవుడికే స‌మ‌ర్పించాల‌ని నిర్ణయించారు. బిక్షాట‌నతో వ‌చ్చిన సొమ్మును త‌న అవ‌స‌రాల‌కు ఖ‌ర్చు చేయ‌కుండా బ్యాంకులో సేవ్ చేశారు. 


Also Read: విశాఖ తీరంలో హై టెన్షన్... భగ్గుమన్న రింగ్ వలల వివాదం... బోటు తగలబెట్టిన మత్స్యకారులు


ఇప్పటి వరకూ రూ.15 లక్షలు విరాళం


బ్యాంకులో నగదు ల‌క్ష రూపాయ‌లు అయిన ప్రతి సారి దేవుడి కార్యక్రమాల‌కు విరాళంగా ఇస్తుంటారు యాదిరెడ్డి. దీంతో ఇప్పటి వ‌ర‌కు అత‌ను 15 లక్షల రూపాయ‌ల‌ను దైవ కార్యక్రమాలకు విరాళంగా స‌మ‌ర్పించారు. తాజాగా ముత్యాలంపాడు సాయిబాబా ఆల‌యంలో నిర్వహిచిన తండులాభిషేకం కోసం లక్షా ఎనిమిది రూపాయ‌లు విరాళంగా అందజేశాడు. 2017లో బాబా మందిరంలో నిత్యాన్నదాన కార్యక్రమానికి ఒక‌ లక్ష, 2018లో లక్ష కొబ్బరి బొండాల అభిషేకానికి లక్ష రూపాయలు, 2019లో గోశాల నిర్మాణానికి 3 లక్షలు, దత్తాత్రేయుడి వెండి విగ్రహానికి రూ.50 వేలు విరాళంగా ఇచ్చారు. 


Also Read:  ఏపీలో షర్మిల రాజకీయ పార్టీ ఖాయమా ? ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు ?


ప్రతి పైసా దైవ సేవకే


ముత్యాలంపాడులోని కోదండ రామాలయానికి ఒక లక్ష విలువైన వెండి సామగ్రి ఇచ్చారు యాదిరెడ్డి. విజయవాడ కనకదుర్గ ఆలయంలో నిత్యాన్నదానానికి లక్ష రూపాయల విరాళం ఇచ్చారు. గత 11 సంవత్సరాలుగా ఆయన ముత్యాలంపాడులో రామాలయం, సాయిబాబా మందిరాల వద్ద బిక్షాటన చేస్తున్నారు. తాను ఆర్జించిన ప్రతి పైసాను దైవ సేవకే వినియోగిస్తాన‌ని యాదిరెడ్డి ఏబీపీ దేశానికి ఇచ్చిన ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్లడించారు. 


Also Read: మరో జీవోను వెనక్కి తీసుకున్న ఏపీ ప్రభుత్వం ...సర్పంచ్‌ల అధికారాలు సేఫ్ !


Also Read: జగన్ మళ్లీ అధికారం చేపట్టకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా.... డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి