తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం డిసెంబర్ నెలకు సంబంధించిన సమయనిర్దేశిత(స్లాటెడ్) సర్వదర్శనం టోకెన్లు నవంబరు 27వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు. తిరుమలలో వసతికి సంబంధించి డిసెంబర్ నెల కోటాను నవంబరు 28వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి స్వామివారి దర్శనం టోకెన్లు, తిరుమలలో వసతి బుక్ చేసుకోవాలని కోరుతోంది.


తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో జ‌రిగే సుప్రభాతం, ఇత‌ర సేవ‌ల‌ను శ్రీ వేంక‌టేశ్వర భ‌క్తి ఛాన‌ల్‌, ఎస్వీబీసీ రేడియో, ఎస్వీ ఎఫ్ఎం రేడియో ద్వారా ప్రసారం చేసుకోవాల‌నే ఉద్దేశంతోనే ఆకాశ‌వాణి ద్వారా ఈ ప్రసారాలను నిలుపుద‌ల చేయించిన‌ట్టు టీడీడీ ఒక ప్రకటనలో తెలిపింది. 2018లో టీటీడీ ఆకాశ‌వాణితో చేసుకున్న ఒప్పందం మేర‌కు ప్రతిరోజూ ఉద‌యం 3 గంట‌ల నుంచి 6 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి ఆల‌యంలో జ‌రిగే సేవ‌ల‌ను ప్రసారం చేసేందుకు గానూ ఆకాశ‌వాణికి ఏడాదికి రూ.35 ల‌క్షల చొప్పున చెల్లించాల్సి ఉంది.


టీటీడీకి సొంత ఛాన‌ల్‌, ఎఫ్ఎం రేడియో ఉన్నందువ‌ల్ల ఆకాశ‌వాణిలో ఈ ప్రసారాలను నిలిపివేయాల‌ని నిర్ణయించుకుకున్నట్టు తెలిపారు. టీటీడీ ఎఫ్ఎం రేడియో, ఎస్వీబీసీ రేడియోలో శ్రీ‌వారి ఆల‌యంలో జ‌రిగే సుప్రభాతం, తోమాల‌, అర్చన ఇతర సేవ‌ల‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్టు టీటీడీ తెలిపింది. భ‌క్తులు ఈ విష‌యాన్ని గుర్తించి స్వామివారి సేవ‌ల‌ను ప్రత్యక్షప్రసారం ద్వారా చూడాలని కోరారు.


Also Read: Best Year End Destinations: ఇయర్ ఎండ్ సెలబ్రేట్ చేసుకునేందుకు అద్భుతమైన ప్రదేశాలివి...


Also Read: Kodali Nani: ఎన్టీఆర్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు.. ఎప్పుడో విడిపోయాం 


Also Read: Viveka Case : దేవిరెడ్డి శంకర్ రెడ్డికి వారం రోజుల సీబీఐ కస్టడీ.. సంచలన విషయాలు బయటకు వస్తాయా ?


Also Read: CM Jagan: 10 లక్షల ఆపరేషన్ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలో తెచ్చాం.. గ్రామస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌


Also Read: Punch Prabhakar: పంచ్‌ప్రభాకర్‌ ఇంటి అడ్రెస్‌ తెలిసింది.. త్వరలోనే అరెస్టు చేస్తాం.. హైకోర్టులో సీబీఐ అఫిడవిట్


Also Read: Tomato Farmers : ఆ రైతు పంట పండించిన టమాటా .. ఒక్క సీజన్‌లో రూ. 80 లక్షలు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి