Today Top Headlines In AP And Telangana:


1. టీటీడీలో అన్యమత ఉద్యోగస్థులపై వేటు


తిరుమల తిరుపతి దేవస్థానాల కొత్త చైర్మన్‌గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు బాధ్యతలు చేపట్టారు. ఆయనకు చైర్మన్ పదవి చేపట్టిన తర్వాత టీటీడీలో హిందువులు మాత్రమే ఉండాలని ఓ ప్రకటన చేశారు. దీనిపై  మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైపీ  వక్ఫ్ బిల్లుతో ముడి పెట్టి విమర్శలు కూడా చేశారు. అయితే టీటీడీలో అన్య మతస్తులు అనే అంశం చాలా కాలంగా వివాదాస్పదంగా ఉంది. అన్యమతస్తుల్ని టీటీడీ నుంచి తప్పించాలని ఉద్యమాలు జరిగాయి. కానీ ఇప్పటికి అది నినాదంలాగే ఉంది. 2019 వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు సీఎస్ గా ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఆ సమయంలో తిరుమలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఆయన ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి విచారణ చేశారు. ఇంకా చదవండి.


2. మనిషిని చంపేసిన చీమలు, ఎక్కడంటే.?


పాములు, తేనెటీగలు కుట్టి వ్యక్తులు చనిపోయిన విషయం మనకు తెలుసు కానీ చీమలు కుట్టడంతో చనిపోయాడు. వైఎస్‌ఆర్ కడప జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆశ్చర్యపరుస్తోంది. ఆటో డ్రైవర్‌గా ఉన్న 29 ఏళ్ల  ద్వారకనాథరెడ్డి చీమలు కుట్టడంతో ఆసుపత్రి పాలై చనిపోయాడు. ఎర్రమద్దివారిపల్లెకు చెందిన ఇతనికి మద్యం తాగే అలవాటు ఉంది. ఫుల్‌గా తాగేసి ఎక్కడ పడితే అక్కడ ఒళ్లు తెలియకుండా పడిపోతుంటాడు. ఈ క్రమంలోనే సోమవారం ఫుల్‌గా తాగేసి ఊరికి సమీపంలో పడిపోయాడు. ఇంకా చదవండి.


3. ఉద్యోగ నియామక ప్రక్రియపై సుప్రీం కీలక తీర్పు


పబ్లిక్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఉద్యోగ భర్తీ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసంది. ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కానీ ప్రక్రియ పూర్తైన తర్వాత కానీ రూల్స్ మార్చలేరని ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం పేర్కొంది. పబ్లిక్ రిక్రూట్‌మెంట్‌ పారదర్శకత, వివక్షరహితంగా ఉండాలి స్పష్టం చేసింది. రూల్స్ అనుమతిస్తే తప్ప ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత నిబంధనలు మధ్యలో మార్చలేరని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఇంకా చదవండి.


4. డీఎస్సీ - 2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్


డీఎస్సీ-2008లో పరీక్ష రాసి కామన్‌మెరిట్‌లో క్వాలిఫై అయి ఉద్యోగాలు రానివారి అభ్యర్థుల పోరాటం ఫలించింది. వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ఉద్యోగాలు చేతికి అందే టైంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వేల మంది నష్టపోయారు. అయితే వారిలో కొందరు తర్వాత పరీక్షలు రాసి ఉద్యోగాలు సంపాదించారు. ఏపీలో కూడా ఇలాంటి బాధితులకు ప్రభుత్వం కాంట్రాక్ట్ పోస్టులు కట్టబెట్టింది. ఇప్పుడు తెలంగాణలో కూడా అలాంటి ప్రక్రియ చేపట్టింది ప్రభుత్వం. డీఎస్సీ-2008లో అప్పట్లో బీఈడీ చేసిన వాళ్లు కూడా ఎస్జీటీ రాసుకునే వీలుండేది. ఇంకా చదవండి.


5. పీఎం విద్యా లక్ష్మి రుణాలు ఎలా పొందాలంటే.?


దేశంలోని ప్రతిభావంతులైన పేద, మధ్యతరగతి విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. వీరు ఉన్నత చదువులకు ఆసరాగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. విద్యార్థులు ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందేందుకు అవసరమైనా రుణాలను అందించేందుకు 'పీఎం విద్యాలక్ష్మి స్కీమ్'ను తెచ్చింది. ఈ మేరకు బుధవారం (నవంబరు 6) ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. పీఎం- విద్యాలక్ష్మీ ద్వారా ఏటా 22 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని ఆయన అన్నారు. ఇంకా చదవండి.