Ants Attack News: పాములు, తేనెటీగలు కుట్టి వ్యక్తులు చనిపోయిన విషయం మనకు తెలుసు కానీ చీమలు కుట్టడంతో చనిపోయాడు. వైఎస్‌ఆర్ కడప జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆశ్చర్యపరుస్తోంది.
ఆటో డ్రైవర్‌గా ఉన్న 29 ఏళ్ల ద్వారకనాథరెడ్డి చీమలు కుట్టడంతో ఆసుపత్రి పాలై చనిపోయాడు. ఎర్రమద్దివారిపల్లెకు చెందిన ఇతనికి మద్యం తాగే అలవాటు ఉంది. ఫుల్‌గా తాగేసి ఎక్కడ పడితే అక్కడ ఒళ్లు తెలియకుండా పడిపోతుంటాడు. ఈ క్రమంలోనే సోమవారం ఫుల్‌గా తాగేసి ఊరికి సమీపంలో పడిపోయాడు.
అపస్మారక స్థితిలో పడి ఉన్న ద్వారకనాథరెడ్డిని చీమలు చుట్టుముట్టాయి. కుట్టడం ప్రారంభించాయి. ఒకట్రెండుతో మొదలైన చీమల దండయాత్ర వందలు వేలకు చేరింది. అలా కింటిన్యూగా చీమలు కుట్టడంతో ద్వారకనాథరెడ్డి తీవ్ర గాయాలు పాలయ్యాడు.
అపస్మరాక స్థితిలో ఉన్న ద్వారకనాథరెడ్డిని చీమలు కుడుతుండటాన్ని స్థానికులు చూశారు. రక్తం కారుతున్న ఆయన్ని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది సూచన మేరకు మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి తిరుపతికి తీసుకెళ్లారు.
రెండు రోజులుగా తిరుపతిలో చికిత్స పొందుతూ ఉన్న ద్వారకనాథరెడ్డి బుధవారం చనిపోయారు. చీమలు కుట్టడంతో వల్ల రక్తస్రావం అవ్వడం, బాడీ ఇన్ఫెక్ట్ అయిందని వైద్యులు చెబుతున్నారు. అందులో మద్యం సేవించే అలవాటు కూడా ప్రాణాల మీదు తీసుకొచ్చింది చెప్పారు.