AP News Developments Today: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవాలు జరగనున్నాయి. ఉదయం విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద కాళీ మాత టెంపుల్ నుంచి పెరియర్ విగ్రహం వరకూ రన్ ఫర్ రాజ్యాంగం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు కృష్ణా కాలేజ్‌లో రాజ్యాంగ దినోత్సవాలు జరుగుతాయి. దీంట్లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొంటారు.
విజయవాడలో సీఎం జగన్.
వైఎస్ జగన్ విజయవాడ లోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొననున్నారు.
ఉదయం 11.10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11.20 గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రం చేరుకుని రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం 12.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
హైదరాబాద్ లో చంద్రబాబు, లోకేష్:.
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ లు హైదరాబాద్ లోనే ఉండనున్నారు. తిరిగి సోమవారంనాడు ఏపీకి తిరిగి రానున్నారు. తెలంగాణ తెలుగుదేశానికి చెందిన కొందరు నేతలకు ఆపాయింట్ మెంట్ ఇచ్చిన దృష్ట్యా వారిని శని,ఆదివారాల్లో కలువనున్నారు.
27న మంగళగిరి కి పవన్ కళ్యాణ్.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు మంగళగిరికి రానున్నారు. ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ లో ఇళ్లను కోల్పోయిన బాధితులకు లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందించనున్నారు. ఇప్పటంలో ఇళ్లు కూల్చివేతపై కొద్ది రోజుల క్రితం రగడ నడిచింది. అధికార విపక్షాల మధ్య వార్ నడిచింది.
ఏలూరు లోనే బీజేపీ.కీలక నేతలు
ఆదివారం నాడు ఏలూరు లో బీజేపీ చేపట్టనున్న బీసీ ల సదస్సు సభ ఏర్పాట్లలో బీజేపీ కీలక నేతలు అంతా ఏలూరు లోనే మకాం వేశారు. వైఎస్ జగన్ పాలనలో ఏపీ లో బీసీలకు అన్యాయం జరుగుతుంది అంటూ వారు భారీ సభను ఏర్పాటు చేశారు. పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు సహా కీలక నేతలు అంతా శనివారం నాడు ఏలూరు లోని సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు.
ఆమ్ ఆద్మీ పార్టీ 10 వ వార్షికోత్సవం
నవంబర్ 26, 2012 లో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటు చేశారు.ఈ నేపథ్యంలో నవంబర్ 26 వ తేదీన ఆమ్ ఆద్మీ పార్టీ 10 వ వార్షికోత్సవం, రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా విశాఖపట్టణం లో ఉదయం 11.00 గంటలకు జోనల్ కో ఆర్డినేటర్ రమేష్ కుమార్, విశాఖపట్నం నగర కన్వీనర్ భీమిశెట్టి పవన్ ఆధ్వర్యంలో 200 మంది కార్యకర్తల తో సమావేశం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శీతల మదాన్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకూ సాధించిన విజయాలు, పార్టీ లక్ష్యాలు, భావజాలం, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలలో చేస్తున్న పాలన, ప్రజా సంక్షేమ పథకాల అమలుపై అవగాహన కల్పిస్తారు. తదుపరి రాజ్యాంగ పరి రక్షణ అవగాహనా పోటీలలో విజేతలకు బహుమతి ప్రదానం జరుగుతుంది. అలాగే విజయవాడలోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది ఆమ్ ఆద్మీ.