నేడు వైఎస్‌ఆర్‌ జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ మూడో రోజు (డిసెంబరు 25) పర్యటించనున్నారు. నేటి షెడ్యూల్ ఇలా ఉండనుంది. ఉదయం 8.40 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్‌ నుంచి బయలుదేరి 9.05 గంటలకు పులివెందుల చేరుకుంటారు. 9.15 – 10.15 సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్‌ ప్రార్ధనల్లో పాల్గొంటారు. 10.25 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి 12.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.


ఆదివారం, భారతదేశ మాజీ ప్రధానమంత్రి, భారతరత్న,  అటల్ బిహారీ వాజ్ పాయ్  జయంతి - గుడ్ గవర్నెన్స్ డే (సుపరిపాలన దినోత్సవం) కార్యక్రమం మధ్యాహ్నం 3:30 గంటలకు హోటల్ నక్షత్ర కన్వెన్షన్ లో నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్య నారాయణ రాజు వెల్లడించారు ఈ మేరకు రాష్ట్ర కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు. బీజేపీ, జనసేన నేతలు హాజరయ్యే ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అధ్యక్షత వహిస్తారు. ముఖ్య అతిథులుగా, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, పాల్గొంటారు. బీజేపీ ఎంపీ GVL నరసింహారావు, జనసేన నాయకులు పాల్గొంటారు. ఈ కార్యక్రమం సాయంత్రం 3.30గంటలకు ప్రారంభం అవుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
 
ఈ నెల 26న శ్రీశైలంకి రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము


భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26న శ్రీశైలం పర్యటనకు రానున్నారు. ఆమె పర్యటన ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ శామూన్, ఎస్పీ రఘువీర్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ నిషాంతి, శ్రీశైలం ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, శ్రీశైలదేవస్థానం ఈఓ ఎస్‌ లవన్న పరిశీలించారు. సున్నిపెంటలోని హెలిప్యాడ్‌ను పరిశీలించారు. నందిసర్కిల్‌లోని సెంట్రల్‌ రిసెప్షన్‌ ఆఫీస్‌ వద్ద కేంద్ర ప్రభుత్వ పథకాల శిలాఫలకాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించనున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్ల విషయంలో టూరిజం శాఖ అధికారులతో మాట్లాడారు.


రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము శ్రీశైల ప‌ర్యట‌నను విజ‌య‌వంతం చేయాల‌ని ఆల‌య ఈవో ల‌వ‌న్న అన్నారు. ద్రౌప‌ది ముర్ము ఈ నెల 26న శ్రీ‌శైల మ‌ల్లికార్జునుడిని ద‌ర్శించుకోనున్నారు. ఈ సంద‌ర్భంగా ఆల‌య ఈవో ల‌వ‌న్నరాష్ట్రప‌తి ప‌ర్య‌ట‌న‌ ఏర్పాట్లపై స‌మీక్ష నిర్వహించారు. గంగాధ‌ర మండ‌పం, ఆల‌యంతో పాటు ప‌ర్యాట‌క కేంద్రం ద‌గ్గర సిబ్బందిని కేటాయించాల‌ని అసెస్టెంట్ క‌మిష‌న‌ర్ వెంక‌టేశ్‌ను ఆయ‌న ఆదేశించారు. పారిశుద్ధ్యం ప‌ట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల‌ని అన్నారు.