Today Top Headlines In AP And Telangana:


1. తిరుమల లడ్డూ వివాదంపై సిట్ దర్యాప్తు నిలిపివేత


తిరుమల లడ్డూ (Tirumala Laddu) తయారీలో కల్తీ నెయ్యి వివాదంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై సిట్ (SIT) దర్యాప్తునకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. సుప్రీంకోర్టులో (Supreme Court) విచారణ నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తదుపరి విచారణను కొనసాగిస్తామని వెల్లడించారు. కాగా, ఇప్పటికే దాదాపు 4 రోజులుగా లడ్డూ అంశంపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇంకా చదవండి.


2. ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ బంపరాఫర్


దసరా పండగ సందర్భంగా ఏపీలోని ప్రయాణికులకు ఆర్టీసీ యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీఎస్ఆర్టీసీ(APSRTC) తరపున 6,100 స్పెషల్ సర్వీస్ లు నడిపేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 4 నుంచి 11వ తేదీ వరకు అంటే దసరా పండగ(Festival)కు ముందు 3,040 బస్సులు(Buses) అందుబాటులో ఉంటాయి. ఇక దసరా మూడు రోజుల రద్దీ పెద్దగా ఉండదు కాబట్టి స్పెషల్ సర్వీస్ లకు బ్రేక్ ఇచ్చారు అధికారులు. దసరా తర్వాత అంటే అక్టోబర్ 12 నుండి 20వ తేదీ వరకు 3,060 స్పెషల్ సర్వీస్ లను ఏపీఎస్ఆర్టీసీ నడిపేందుకు నిర్ణయించింది. ఇంకా చదవండి.


3. హైదరాబాద్‌లో డీజేలపై నిషేధం


హైదరాబాద్ నగరంలో డీజేలపై నిషేధం విధించారు. ఈ మేరకు సీపీ సీవీ ఆనంద్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. సౌండ్ సిస్టం పరిమిత స్థాయిలో అనుమతిస్తామని అన్నారు. సౌండ్ సిస్టంకు కూడా పోలీసుల అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు. అలాగే, మతపరమైన ర్యాలీల్లో బాణాసంచా నిషేధమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తామని చెప్పారు. ఇంకా చదవండి.


4. కేటీఆర్ కారుపై దాడి


ముషీరాబాద్‌లోని మూసి నిర్వాసిత ప్రాంతాల్లో ఉన్న వారికి ధైర్యం చెప్పేందుకు వెళ్తున్న కేటీఆర్ కాన్వాయ్ ను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. మంత్రి కొండా సరేఖపై  బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా విభాగం చేస్తున్న తప్పుడు ప్రచారంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.  మంత్రి కొండ సురేఖకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు.  నిన్న తెలంగాణ భవన్ బయట కాంగ్రెస్ శ్రేణులను కొట్టినందుకు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ సందర్భంగా ముషీరాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇంకా చదవండి.


5. పండుగ పూట వంటింట్లో గ్యాస్ మంట


భారతీయులకు అక్టోబర్‌ నెల చాలా కీలకం. ఈ నెలలో దసరా, దీపావళి వంటి కీలక పండుగలు ఉన్నాయి. చదువుల కోసం, సంపాదన కోసం ఎక్కడెక్కడో స్థిరపడ్డ వాళ్లంతా తిరిగి స్వగ్రామాలకు చేరతారు. చాలా ఇళ్లు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కళకళలాడతాయి. కాబట్టి, ఈ నెలలో వంట గ్యాస్‌ అవసరం పెరుగుతుంది. అయితే, ఈ నెల ఒకటో తేదీన (అక్టోబర్‌ 01, 2024) గ్యాస్‌ ధరలు పెరిగాయి. ఒక్కో సిలిండర్‌ రేటు రూ.48.50 (Commercial LPG Cylinder Price Today) పెరిగింది. అయితే, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కిలోల గ్యాస్ సిలిండర్‌ మీదే రేటు పెంచారు. ఇళ్లలో వంటకు ఉపయోగించే 14 కేజీల సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఇంకా చదవండి.