మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మట్కా' రిలీజ్ డేట్ ను తాజాగా మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతోంది? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.
నవంబర్ లో బాక్స్ ఆఫీస్ బరిలోకి 'మట్కా'
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా 'పలాస' ఫేమ్ డైరెక్టర్ కరుణ కుమార్ (Karuna Kumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'మట్కా'. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇప్పటిదాకా కనిపించిన విభిన్నమైన లుక్ లో కనిపించబోతున్నారు. ఇక ఇందులో వరుణ్ తేజ్ సరసన మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్ళూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వరుణ్ తేజ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ మంచి హైప్ ని క్రియేట్ చేశాయి. కాగా ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా? అని ఈగర్ గా వెయిట్ చేస్తున్న మెగా అభిమానులకు అక్టోబర్ 1 న ఉదయం గుడ్ న్యూస్ చెప్పబోతున్నాం అంటూ ఇప్పటికే చిత్ర బృందం తెలిపింది. చెప్పినట్టుగానే తాజాగా 'మట్కా' మూవీ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ 'మట్కా' మూవీని ఈ ఏడాది అక్టోబర్ 14న రిలీజ్ చేయబోతున్నాము అంటూ వరుణ్ తేజ్ వింటేజ్ లుక్ లో ఉన్న ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో వరుణ్ తేజ్ నోట్లో సిగరెట్ పెట్టుకుని, సూటు బూటు ధరించి చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.
వరుణ్ కెరీర్ కి గేమ్ ఛేంజింగ్ అవుతుందా?
మెగా హీరో అయినప్పటికీ గత కొంతకాలంగా వరుణ్ తేజ్ సినిమాలు ఆశించిన విజయాలు అందుకోవడం లేదు. 'ఎఫ్ 2' తర్వాత వరుణ్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటీ పడలేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన 'ఆపరేషన్ వాలెంటైన్' అనే పాన్ ఇండియా మూవీ కూడా బెడిసి కొట్టింది. ఇక తాజాగా 'మట్కా' మూవీ మేకర్స్ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తుంటే ఇది వరుణ్ కెరీర్ కి గేమ్ ఛేంజింగ్ మూవీ అవుతుందని అనిపిస్తోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఫ్రెండ్ విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. 'మట్కా' అనే గేమ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో 24 ఓ యువకుడు 'మట్కా' సామ్రాజ్యానికి కింగ్ గా ఎలా ఎదిగాడు? అనే విషయాన్ని తెరపై చూపించబోతున్నారు. మరి ఈ మూవీతోనైనా వరుణ్ తేజ్ బౌన్స్ బ్యాక్ అవుతాడా? అనేది చూడాలి.
Also Read: ఆస్పత్రిలో సూపర్ స్టార్ రజనీకాంత్... హెల్త్ అప్డేట్ ఇచ్చిన సతీమణి లత