ఊచకోత... రికార్డుల మోత... బాక్సాఫీస్ బరిలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Man Of Masses NTR) 'దేవర' దూకుడు చూపిస్తూ ముందుకు వెళుతోంది. మూడు రోజుల్లో 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రికార్డుల దిశగా దూసుకు వెళుతుంది. మిక్స్డ్ రివ్యూలు వచ్చినప్పటికీ... ఎన్టీఆర్ స్టార్ పవర్ థియేటర్లకు ప్రేక్షకులు వచ్చేలా చేసింది.‌ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న అభిమానులకు మరో గుడ్ న్యూస్! ఈ వారం 'దేవర' సక్సెస్ మీట్  (Devara Success Meet) జరగనుంది.


గురువారం గుంటూరులోని పెదకాకానిలో...
Devara Success Meet Date: స్టార్ హీరో సినిమా అంటే విడుదలకు ముందు భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించడం అక్కడ అభిమానులను హీరో కలవడం జరిగే తంతు.‌ అయితే... జన సంద్రంలా అభిమానులు పోటెత్తడంతో 'దేవర' ప్రీ రిలీజ్ ఫంక్షన్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. అందువల్ల, ఎన్టీఆర్ అభిమానుల ముందుకు రాలేదు. సినిమా సక్సెస్ తర్వాత ఇప్పుడు వస్తున్నారు. 


Devara Success Meet Venue: అక్టోబర్ 3వ తేదీన... అంటే ఈ గురువారం గుంటూరు జిల్లాలోని పెదకాకాని ఏరియాలో భారీ ఎత్తున 'దేవర' సక్సెస్ మీట్ జరగనుంది. అందుకోసం ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టారు. శ్రేయాస్ మీడియా సంస్థ సక్సెస్ మీట్ నిర్వహణకు ఏర్పాట్లు మొదలు పెట్టింది. 


'దేవర' విడుదలకు ముందు హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని నోవాటెల్ హోటల్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ క్యాన్సిల్ అయిన తర్వాత రెండు మూడు రోజుల్లో మరో ఈవెంట్ చేస్తారని అభిమానులు ఆశించారు. అయితే... ఎన్టీఆర్ అమెరికా వెళ్లాల్సిన షెడ్యూల్ (బియాండ్ ఫెస్ట్ కోసం) ముందుగా ఖరారు కావడంతో ఈవెంట్ చేయలేదు. ఇప్పుడు సినిమాకు భారీ వసూళ్లు రావడంతో పాటు అభిమానులను మెప్పించడం వల్ల సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నారు.


Also Read: ఆస్పత్రిలో సూపర్ స్టార్ రజనీకాంత్... హెల్త్ అప్డేట్ ఇచ్చిన సతీమణి లత



సోమవారం నుంచి కొంత తగ్గినా స్టడీగా 'దేవర' కలెక్షన్లు!
'దేవర' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచాయి.‌ ఈ సినిమా విడుదలైన మొదటి రోజు మిక్స్డ్ టాక్ వినిపించింది.‌ కానీ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా థియేటర్లకు భారీ ఎత్తున వచ్చారు. దాంతో మూడు రోజుల్లోనే 300 కోట్ల కలెక్షన్ వసూలు చేసింది. సోమవారం నుంచి వసూళ్లు కొంత తగ్గినప్పటికీ... కలెక్షన్ స్టడీగా ఉన్నాయని ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. అక్టోబర్ రెండున గాంధీ జయంతి కావడం, ఆ తర్వాత నుంచి దసరా సెలవులు ఉండటంతో మరో వారం రోజులు చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.‌


Also Readపదికి పైగా సినిమాలు... వెబ్ సిరీస్‌లకు లెక్క లేదు - ఈ వారంలో ఏ ఓటీటీలో ఏవేవి స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?