Top Headlines In AP And Telangana:


1. అమరావతి నిర్మాణంపై కీలక అప్ డేట్


అమరావతిలో నిర్మాణ పనులు పునః ప్రారంభించి పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు(Andhra Pradesh CM Chandra Babu) అధ్యక్షత‌న సమావేశమైన సీఆర్డీఏ(CRDA) 38వ అథారిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. అమ‌రావ‌తి నిర్మాణానికి సంబంధించిన ఏడు అంశాల‌కు అథారిటీ ఆమోదం తెలిపింది. నిర్మాణాలు పునః ప్రారంభించిన తర్వాత అన్నింటికీ ఓ కాలపరిమితితో ముందుకెళ్లాలని నిర్ణయించారు. సీఆర్డీఏ చట్టం 2014 ప్రకారం అథారిటీ అకౌంట్స్‌ను ఏటా జులై 31లోగా అకౌంటెంట్ జ‌న‌ర‌ల్‌కు ఇవ్వాలి. 2014 నుంచి 2017 సంబంధించిన రిపోర్ట్‌ల‌ను 2018లోనే ఏజీకి స‌మ‌ర్పించారు. 2017-18 నుంచి ఆడిటింగ్ జ‌ర‌గ‌లేదు. ఇంకా చదవండి.


2. వైసీపీ వర్ష్‌షాప్‌లో మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు


తాడేపల్లిలోని తన నివాసంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలతో  జగన్ సమావేశమయ్యారు. ఉదయం నుంచి సాగినన్న వర్క్‌షాప్‌లో జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలీ ఎన్నికలు అంటూ ప్రచారం సాగుతోందని...అది అమలు అయితే కచ్చితంగా ఎన్నికలు వస్తాయని అన్నట్టు తెలుస్తోంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ నేతలు, కేడర్ సిద్ధంగా ఉండాలని లీడర్లకు సూచించారు. దేశంలోనే బలమైన పార్టీగా వైసీపీని మార్చాలని నేతలకు దిశీనిర్దేశం చేశారు. ఇంకా చదవండి.


3. ఆయుష్మాన్ కార్డుతో ఫ్రీగా వైద్య సేవలు


భారత ప్రభుత్వం, దేశంలోని ప్రజల సంక్షేమం కోసం చాలా పథకాలను అమలు చేస్తోంది. వాటిలో ఆరోగ్యానికి సంబంధించిన పథకాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు, వైద్యం చాలా ఖరీదైన వ్యవహారంలా మారింది. మన దేశంలో, కాస్ట్‌లీ మెడికల్‌ ట్రీట్‌మెంట్‌ను భరించలేని పేద ప్రజలే మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. ఈ వర్గాల ప్రజల కోసం, భారత ప్రభుత్వం 2018లో 'ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన'ను ప్రారంభించింది. ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన (Pradhan Mantri Ayushman Bharat Yojana) కింద, భారత ప్రభుత్వం అర్హులైన లబ్ధిదార్లకు 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య చికిత్స సౌకర్యాన్ని అందిస్తోంది. ఇంకా చదవండి.


4. మంత్రి కొండా సురేఖను వెండాడుతోన్న వివాదాలు


తెలంగాణలో ఫైర్ బ్రాండ్ లీడర్‌గా పేరున్న కొండా సురేఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది కాక ముందు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. తన శాఖ విషయంలో కాదు. అవినీతి విషయంలో కాదు. పూర్తిగా రాజకీయ కారణాలతోనే వివాదాస్పదమవుతున్నారు. ఓ వైపు నాగార్జున ఫ్యామిలీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, మరో వైపు సొంత పార్టీ నేతలతో లేని సఖ్యత కారణంగా ఆమె ఉక్కపోత ఎదుర్కొంటున్నారు. ఆమెపై ఫిర్యాదు చేసేందుకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీకి వెళ్లాలనుకుంటున్నారు. ఇంకా చదవండి.


5. హైడ్రా, మూసి ప్రక్షాళనకు నైతిక బలం వచ్చినట్లేనా.?


హైదరాబాద్‌లో గత రెండు నెలలుగా కూల్చివేతలు, మూసి ప్రక్షాళన అంశం హాట్ టాపిక్స్ గా ఉన్నాయి. చెరువులను కబ్జా చేసి నిర్మించిన ఇళ్లు, ప్రభుత్వ భూముల్లో నిర్మించిన భవనాలు, మూసిని ఆక్రమించేసి కట్టిన కాలనీలను ప్రభుత్వం ఖళీ చేయిస్తోది. కూల్చేస్తోంది. దీనిపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. తాము కూల్చివేతల్ని అడ్డుకుంటామని ప్రకటిస్తూ వస్తున్నాయి . అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మూసి ప్రకాళన, చెరువుల కబ్జాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని గట్టిగానే చెబుతున్నారు. ఇంకా చదవండి.