Hyderabad Problems : హైదరాబాద్‌లో గత రెండు నెలలుగా కూల్చివేతలు, మూసి ప్రక్షాళన అంశం హాట్ టాపిక్స్ గా ఉన్నాయి. చెరువులను కబ్జా చేసి నిర్మించిన ఇళ్లు, ప్రభుత్వ భూముల్లో నిర్మించిన భవనాలు, మూసిని ఆక్రమించేసి కట్టిన కాలనీలను ప్రభుత్వం ఖళీ చేయిస్తోది. కూల్చేస్తోంది. దీనిపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. తాము కూల్చివేతల్ని అడ్డుకుంటామని ప్రకటిస్తూ వస్తున్నాయి . అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మూసి ప్రకాళన, చెరువుల కబ్జాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని గట్టిగానే చెబుతున్నారు. హైదరాబాద్‌ను కాపాడుకునేందుకు కఠిన చర్యలు తీసుకోక తప్పదని ఆయన అంటున్నారు. ప్రస్తుతం కొన్ని సమస్యల కారణంగా కూల్చివేతలు ఆగాయి. 


చెన్నై, బెంగళూరుల్లో వరదలతో కొత్త చర్చ


న్యాయపరమైన సమస్యల కారణంగా  హైడ్రా కూల్చివేతలు ఆగాయి. ఈ సమయంలో  చెన్నై , బెంగళూరు నగరాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ రెండు నగరాలు రోజంతా నీళ్లలో మునిగితేలుతున్నాయి. వాహనాలు ఎక్కడ ముునిగిపోతాయోనని చెన్నై వాసులు తమ కార్లను ఫ్లైఓవర్ల మీద పార్క్ చేసుకుంటున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. నిజానికి చెన్నైకి ఈ సమస్య గతంలోనూ వచ్చింది. అందుకే ముందు జాగ్రత్తగా వారు ఈ పని చేసుకున్నారు. ఇక బెంగళూరులోనూ అదే పరిస్థితి కనిపించింది. వర్షం దెబ్బకు నీళ్లు నిలబడిపోవడంతో ఎవరూ బయటకు రావొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది. హైదరాబాద్‌కు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనల్ని మనం సంస్కరించుకోవాలని తెలంగాణలో ఈ వానల వల్ల ప్రచారం ప్రారంభమయింది. 


ఇందిరమ్మ కమిటీలతో క్షేత్ర స్థాయికి కాంగ్రెస్ - పార్టీ బలోపేతానికి రేవంత్ మాస్టర్ ప్లాన్ !


హైదరాబాద్‌కు రికార్డు స్థాయి వర్షాలొస్తే నరకమే


నిజానికి వర్షాలు వస్తే ముంపు సమస్య ఉండేది చెన్నై, బెంగళూరుకు మాత్రమే కాదు. హైదరాబాద్‌కూ ఎక్కువే. నాలుగేళ్ల కిందట హైదరాబాద్‌లో రెండు గంటల పాటు కురిసిన వర్షానికి సగం హైదరాబాద్‌లో విధ్వంసం కనిపించింది. వందేళ్లలో వచ్చిన వరద అని  ప్రభుత్వం సరి పెట్టుకుంది. కానీ మళ్లీ వందేళ్ల దాకా రాదన్న గ్యారంటీ లేదు. ఇప్పుడు పడుతున్న వర్షాల కారణంగా గట్టిగా గంట సేద జడి వాన కురిస్తే జన జీవనం స్తంభించిపోతుంది. కాలనీల్లోకి నీళ్లు వస్తాయి. అంతంతమాత్రంగా ఉన్న చెరువులు పొంగుతాయి. దీనికి కారణం నాలాలు సహా మూసి నది కూడా ఆక్రమణకు గురి కావడంతో చెరువుల్లో కొన్ని అడ్రస్ లేకుండా పోవడం కూడా ఈ పరిస్థితికి కారణం. 


సీఎం రేవంత్ రెడ్డిపై ప్రధాని మోదీకి ఫిర్యాదు, అసలేం జరిగింది?


హైదరాబాద్‌ను కాపాడుకోవాలంటున్న తెలంగాణ ప్రభుత్వం 


కబ్జాలు చేసిన వారిని శిక్షిస్తే ఇళ్లు తొలగిస్తే ప్రజా వ్యతిరేకత వస్తుందన్న కారణంగా వెనుకడుగు వేస్తే హైదరాబాద్ భవిష్యత్‌కు పెను ప్రమాదమని కాంగ్రెస్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ విషయంలో చాలా స్పష్టతగా ఉన్నారు. అక్రమార్కుల్ని కబ్జా దారుల్ని ఇబ్బంది పెడితే సామాన్య జనం వ్యతిరేకంగా మారబోరని.. హైదరాబాద్ ను కష్టాల నుంచి గట్టెక్కిస్తే అందరూ తనకు మద్దతుగా ఉంటారని అనుకుంటున్నారు. మూసిని ప్రక్షాళన చేయకపోతే మొదటికే మోసం వస్తుందని ఆయన ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు చెప్పుకోవడానికి ఓ అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా ఆలోచించడానికి అవకాశం ఏర్పడుతుంది.