Andhra Pradesh Crime News: వైసీపీ సీనియర్ లీడర్, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై కేసు నమోదు అయింది. బాలికపై అత్యాచారం జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేశారని ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు. కొద్ది రోజుల క్రితం ఎర్రావారిపాలెం మండలంలో బాలికపై దాడి జరిగింది. వెంటనే ఆమెపై అత్యాచారం జరిగిందని కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని ప్రచారం చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. దీనిపై బాలిక తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు తప్పుడు ప్రచారం చేసినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు. ఆయనతోపాటు మరికొందరిపై కూడా పోక్సో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు పోలీసులు.
అసలేం జరిగింది?
తిరుపతికి సమీపంలోని ఎర్రావారిపాలెంలో స్కూల్‌కి వెళ్లి వచ్చే బాలిక ఒక రోజు ఇంటికి త్వరగా రాలేదు. కంగారు పడిన తల్లిదండ్రులు ఆమెను వెతికారు. ఆమె గాయాలతో ఊరికి సమీపంలోని ఓ ప్రాంతంలో పడి ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దీంతో ఆమెపై అత్యాచారం జరిగిందని ప్రచారం చేశారు.
అత్యాచారం జరిగిందని దుష్ప్రచారం
సోషల్‌మీడియాతోపాటు ప్రధాన మీడియా, వైసీపీ నేతలు చేసిన ప్రచారాన్ని అప్పట్లోనే బాలిక తండ్రి, పోలీసులు ఖండించారు. వైద్య పరీక్షల్లో ఇంకా అత్యాచారం గురించి తేలకుండానే దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. స్నేహితుల మధ్య ఉన్న గొడవతోనే ఆమెను గాయపరిచారని... ఎలాంటి అత్యాచారం జరగలేదని స్పష్టం చేశారు.
బాలికను కలిసేందుకు విఫలయత్నం
బాలికపై దాడి జరిగిందని తెలుసుకున్న తిరుపతి ఎంపి డాక్టరు గురుమూర్తి, మాజీ మంత్రి ఆర్‌కె రోజా, మాజీ ఎంఎల్‌ఏ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సహా వైసీపీ సీనియర్ నేతలంతా ఆసుపత్రిలో బాలికను పరామర్శించేందుకు ట్రై చేశారు. దీనికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీనిపై మీడియాతో మాట్లాడిన చెవిరెడ్డి మిగతా వాళ్లంతా బాలికపై అత్యాచారం జరిగిందని అందుకే పోలీసులు తమను లోపలికి అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. బాలికతో మాట్లాడితే అసలు విషయాలు తెలుస్తాయని అన్నారు.
Also Read: చెవిరెడ్డి వర్సెస్ బాలినేని - వీళ్ల పరస్పర ఆరోపణల్లో ఎన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయంటే ?
దుష్ప్రచారం వదన్న తండ్రి
ఘటనపై అప్పట్లోనే స్పందించి జిల్లా ఎస్‌పి... బాధితురాలికి వైద్యపరీక్షలు చేశామని అత్యాచారం జరగలేదని చెప్పారు. కుటుంబ సభ్యులు సైతం ఇదే విషయాన్ని మీడియాకు వెల్లడించారు. గాయాలతో పడి ఉన్న బాలికను చూసి ఫోన్ చేసిన 20 నిమిషాల్లోనే పోలీసులు వచ్చారని తమకు అండగా ఉన్నారని పేర్కొన్నారు. అత్యాచారం జరగపోయినా అలాంటి ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. రాజకీయాలు ఉంటే వేరే విధంగా చూసుకోవాలే తప్ప ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేలా ఉండకూడదని అన్నారు.
తమ బిడ్డపై అత్యాచారం జరగకపోయినా జరిగినట్టు ప్రచారం చేసే వారిపై ఎర్రవారిపాలెంలోనే కేసు పెట్టారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చెవిరెడ్డి సహా పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. వారి వీడియోను పరిశీలిస్తున్నారు.
Also Read: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?