Resignations from YSRCP are increasing: ఎన్నికల్లో పరాజయం తర్వాత ఏ పార్టీకి అయినా సమస్యలు వస్తాయి. కొంత మంది నేతలు వెళ్లిపోతారు. అయితే వారికి భవిష్యత్ పై ఆశలు కల్పించి పార్టీ మారకుండా చేసుకునేలా ఆ పార్టీ పెద్దలు ప్రయత్నించాల్సి ఉంది. వైఎస్ఆర్‌సీపీకి ఎమ్మెల్సీలు వరుసగా రాజీనామా చేస్తున్నా  వారికి సర్ది చెప్పేందుకు పెద్దగా ఎవరూ ప్రయత్నించడం లేదు. ఏరి కోరి పార్టీలోకి తీసుకు వచ్చిన నేతలు కూడా పదవులకు కూడా రాజీనామాలు చేసి వెళ్తున్నారు. ఈ ట్రెండ్ ఇలా కొనసాగితే రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా వలసలు ఉంటాయని భావిస్తున్నారు. 


టీడీపీ నుంచి తీసుకొచ్చి మరీ ఎమ్మెల్సీ ఇస్తే జంప్ 


వైసీపీకి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. ఆయనను టీడీపీ నుంచి ప్రత్యేకంగా పదవి ఆఫర్ చేసి మరీ వైసీపీలో చేర్చుకున్నారు. తీరా ఇప్పుడు పార్టీ ఓడిపోయే సరికి పదవికి కూడా రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఆయన జనసేనతో టచ్ లోకి వెళ్లారని అంటున్నారు. వైసీపీకి ఇప్పటికి ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామాలు చేశారు. ఇంకా చాలా మంది దారిలో ఉన్నారని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తీసుకున్న కొన్ని నిర్ణయాలు, చర్యల వల్ల ఇప్పుడు  తాము నిండా మునిగిపోయే పరిస్థితిలో ఉన్నామని అనుకుంటున్న ఎక్కువ మంది నేతలు తమ దారి తాము చూసుకునేందుకు రెడీ అవుతున్నారు. వీరిలో అత్యంత సీనియర్లు కూడా ఉన్నారని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 



Also Read: Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?




సిక్కోలు నుంచి నెల్లూరు వరకూ చాలా మంది సీనియర్లు నోరు తెరవడం లేదు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలలో అత్యధిక మంది తమ దారి తాము చూసుకునేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారని..   మూడు కూటమి పార్టీల్లో ఎక్కడ చాన్స్ వచ్చినా చేరిపోయేందుకు రెడీ అంటున్నారని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.  శాసనమండలి సభ్యులలో నలుగురు రాజీనామా చేశారు. వారి రాజీనామాలు ఆమోదించలేదు కానీ..మరో పదిమంది వరకూ పార్టీ కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. మండలికి వచ్చినా సైలెంటుగా గా కూర్చుని వెళ్లిపోయారు. వైసీపీ సభ్యులతో కలిసి టీడీపీ సభ్యులపై విరుచుకుపడేందుకు సిద్దపడలేదు. అందుకే పది మంది సభ్యులే టీడీపీకి మండలిలో ఉన్నా.. అధికారికంగా 30కిపైగా సభ్యులు వైసీపీకి ఉన్నా కనీస ప్రభావం చూపలేకపోయారని భావిస్తున్నారు. 


Also Read:  పోలీసులతోనే దొంగా పోలీసు ఆట ఆడుతున్న ఆర్జీవీ - రిస్క్ చేస్తున్నారా ?


ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న వైసీపీ హైకమాండ్


మరో వైపు వైసీపీ హైకమాండ్ అనేక రకాల సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. పార్టీ నేతల్ని బుజ్జగించే పరిస్థితిలో లేదు. లడ్డూ కల్తీ వ్యవహారం దగ్గర నుంచి అదానీ విద్యుత్ ఒప్పందాల వరకూ అనేక అంశాలు సమస్యలుగా మారుతున్నాయి. ఈ అంశంపై అధికార  పార్టీ ఏం చేయబోతోందోనన్న ఉత్కంఠ ఉంది. పార్టీ నేతలతో పని లేదని.. పార్టీ మీద ఆధారపడేవారు వెళ్లిపోయినా నష్టం లేదని వారి  కోసం సమయం వృధా చేసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నారని అంటున్నారు. అంటే పార్టీని వీడిపోయేవారు పోయినా పట్టించుకోమని చెబుతున్నట్లుగా తీరు ఉందని అనుకోవచ్చు.