Pawan Kalyan went to Delhi: ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారు. ఆయన ఎవరితో అయినా సమావేశం అవుతారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. అయితే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇంట్లో జరగనున్న ఓ శుభకార్యంలో పాల్గొనే అవకాశం ఉంది. ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్నారు కాబట్టి అధికారికంగా ప్రకటించలేదని అంటున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కల్యాణ్ రెండో సారి ఢిల్లీ వెళ్తున్నారు. కొద్ది రోజుల కిందట ఆయన ఢిల్లీ వెళ్లి  అమిత్ షాతో సమావేశం అయ్యారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం కోసం ఆయనను అమిత్ షా పిలిచినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఇప్పుడు మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు.                              


Also Read:  పోలీసులతోనే దొంగా పోలీసు ఆట ఆడుతున్న ఆర్జీవీ - రిస్క్ చేస్తున్నారా ?


పవన్ కల్యాణ్ ఢిల్లీలో రాజకీయ పరమైన సమావేశాలు జరిపే అవకాశం లేదేని అలాగే.. ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎంగా కేంద్ర మంత్రుల్ని.. కూడా కలిసే అవకాశం  లేదని ఈ ఢిల్లీ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమైనదేనని జనసేన వర్గాలు చెబుతున్నాయి. పవన్ కల్యాణ్ ఇటీవలి కాలంలో  ఎన్డీఏకు కీలక మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నారు. మహారాష్ట్రలో చురుకుగా ప్రచారం చేయడంతో ఆయన ప్రచారం చేసిన అన్ని ప్రాంతాల్లోనూ అభ్యర్థులు మంచి విజయం సాధించారు.                                                         



బీజేపీ అగ్రనేతల సూచనల మేరకే పవన్ కల్యాణ్ ఇటీవలి కాలంలో ఎక్కువగా హిందూత్వవాదాన్ని వినిపిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో స్పష్టత లేదు. ఈ అంశంపై ఆయన ఎప్పుడూ నేరుగా బీజేపీ నేతలతో సంప్రదింపులు జరపలేదు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని తేలిన తర్వాత ఆయన సనాతన ధర్మ పోరాటాన్ని ఎంచుకున్నారు. ప్రత్యేకంగా వారాహి డిక్లరేషన్ ను కూడా ప్రకటించారు. తమిళనాడులో డీఎంకే రాజకీయ వారుసజిగా పేరు తెచ్చుకున్న యువనేత, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ విమర్శలు గుప్పించారు. 



Also Read: Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?