Ambati Rambabu announced that Pushpa 2 movie cannot be stopped: ఏపీలో వైసీపీ నేతలు అల్లు అర్జున్ కు మద్దదతుగా మాట్లాడేందుకు లేని పోని వివాదాల్ని తెరపైకి తెస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా తమ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల్ని అరెస్టు చేస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన అంబటి రాంబాబు  అక్కడ మీడియాతో మాట్లాడారు. పుష్ప 2 ప్రస్తావన తీసుకు వచ్చారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని ప్రకటించారు. గతంలో ఎన్టీఆర్ సినిమాని కూడా ఆపాలని ప్రయత్నించారు కానీ ఆపగలిగారా అని ప్రశ్నించారు.  


Also Read:  పోలీసులతోనే దొంగా పోలీసు ఆట ఆడుతున్న ఆర్జీవీ - రిస్క్ చేస్తున్నారా ?


తాను  పుష్ప-2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాననని.. పుష్ప పార్ట్ 1 హాలీవుడ్ రేంజ్‌లో ఉందన్నారు.  అందరినీ తలదన్నే స్థాయికి అల్లు అర్జున్ ఎదిగారు... అందుకే కొందరికి కడుపు మండుతునట్లు ఉందన్నారు.అంబటి రాంబాబు మంత్రిగా ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ సినమాలు విడుదలైన తర్వాత రివ్యూలు , కలెక్షన్లను నెగెటివ్ గా చెప్పేవారు. ఇప్పుడు అల్లు అర్జున్ గురించి పాజిటివ్ సినిమా విడుదల కాక ముందే స్పందిస్తున్నారు. మెగా కుటుంబం నుంచి అల్లు అర్జున్ ను మరింత దూరం ఆయన మా పార్టీ మద్దతుదారుడు అనిపించుకునేలా చేసేందుకు అంబటి రాంబాబు వ్యూహాత్మకంగా ఈ ప్రకటనలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. 



 
అసలు ఏపీలో ఇంత వరకూ  పుష్ప 2కు వ్యతిరేకంగా ఎవరూ ఒక్క ప్రకటన చేయలేదు. పైగా పుష్ప 2 సినిమాకు అత్యధిక రేట్లను ఖరారు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలోల పుష్ప 2ను ఎవరో అడ్డుకుంటారని అంబటి రాంబాబు మాట్లాడటం పూర్తిగా రాజకీయం  చేసి సినిమాకు సంబంధం లేని అంశాలను చొప్పించడానికేనని అంటున్నారు. నిజానికి పుష్ప 1 సినిమాకు రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వలేదు. అంత గొప్పగా ఉంటే అప్పుడు ఎందుకు చాన్స్ ఇవ్వలేదని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. 


Also Read: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?


అల్లు అర్జున్ నంద్యాలోల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా ఆయన ఇంటికి వెళ్లారు. అక్కడ ఆయన ఎన్నిల ప్రచారం చేయలేదు.  కేవలం వెళ్లారు. మద్దతుగా ఉన్నారన్న సంకేతాలు పంపారు. అయితే వైసీపీ నేతలు అల్లు అర్జున్ మా పార్టీకి చెందిన నేత అన్న ప్రచారం చేసుకునేందుకు దీన్ని ఉపయోగించుకుంటున్నారు. పుష్ప 2 విషయంలో అంబటి రాంబాబు మరితం వివాదాస్పదంగా మాట్లాడుతూ వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వంలో సినీ రంగానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోంది కానీ.. తమకు వ్యతిరేకంగా పని చేశారని ఎవరికీ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోలేదని గుర్తు చేస్తున్నారు. అల్లు అర్జున్ కు.. పవన్ కు దూరం పెంచితే అతి తమకు ఉపయోగపడుతుందని వైసీపీ భావిస్తోందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.