TTD releases August 2022 quota of Arjitha Seva tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) విడుదల చేసింది. ఆగస్టు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల కోటాను నేటి (మే 24న) మంగళవారం ఉదయం 9 గంటలకు టీటీడీ విడుదల చేసింది.
అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్లు..
శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్ల (Tirumala Darshan Tickets)ను టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో భక్తులకు అందిస్తోంది. ఆన్‌లైన్ ద్వారా టికెట్లను భక్తులను తీసుకోవాల్సి ఉంటుందని టీటీడీ అధికారులు సూచించారు. కరోనా వ్యాప్తి తరువాత గత రెండు మూడు నెలలుగా తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. సేవా టికెట్లను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ పద్ధతుల్లో అందించి భక్తులకు స్వామి వారి దర్శనం జరిగేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. గత నెలలో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో, టికెట్లు లేకపోయినా భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు.
మధ్యాహ్నం మరిన్ని సేవలకు టికెట్లు
ఆగస్టు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, జులై నెలకు సంబంధించిన అష్టదళ పాద పద్మారాధన సేవ టికెట్లను నేటి మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. మే 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 26వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఆన్‌లైన్ డిప్ తీసి సేవా టికెట్లు పొందిన వారికి సమాచారం అందిస్తారు. భక్తులు ఆన్‌లైన్‌లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లు పొందాల్సి ఉంటుంది. అయితే జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన వర్చువల్ కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్ల బుకింగ్ మే 25వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మొదలవుతుంది.
Also Read: Hanuman Jaya Mantram: హనుమాన్ జయమంత్రం, పిల్లలతో నిత్యం ఇది చదివించడం చాలా అవసరం - ఎందుకంటే!
Also Read: వివాహం, సంతానం, శని బాధలు ఇలా సుందరకాండలో ఏ ఘట్టం చదివితే ఎలాంటి సమస్యలు తీరుతాయో తెలుసా