CPS Cancellation Demand by AP Government Employees: ఏపీలో సీపీఎస్ రద్దు అంశం నివురు గప్పిన నిప్పులా ఉంది. మెన్నా మధ్య ప్రభుత్వ ఉద్యోగులంతా రోడ్కెక్కి ఆందోళన చేయటంతో రాష్ట్ర ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. దీంతో ఈ వ్యవహరం పై ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చలు తాత్కాలికంగా ఫలించినప్పటికి... దీర్ఘకాలికంగా సీపీఎస్ రద్దు వ్యవహరం ఉత్కంఠకు దారితీస్తోంది. సీపీఎస్ కు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం జీపీఎస్ అంశాన్ని తెర మీదకు తెచ్చింది. అయితే ఉద్యోగులు మాత్రం ప్రభుత్వం తక్షణమే సీపీఎస్ ను రద్దు చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. దీంతో సీపీఎస్ రద్దు అంశం మళ్లీ హీటెక్కిస్తోంది.
సీపీఎస్ రద్దుపై ఉద్యోగుల్లోనూ విభేదాలు..
ఇప్పటికే సీపీఎస్ రద్దు అంశంపై ఉద్యోగ సంఘాల్లో కూడ విభేదాలు వచ్చాయి. అన్ని ఉద్యోగ సంఘాలు కలసి సమ్మెకు వెళ్లే సమయంలో సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో లాలూచీ పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఉపాధ్యాయ సంఘాలు అన్ని కలసి మరో ఉద్యమానికి తెర తీశారు. సీపీఎస్ రద్దు అనే ప్రధాన అజెండా పైనే వీరి ఉద్యమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మూడు ఏళ్ల పాలన పూర్తి చేసుకోబోతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ వ్యవహరం కత్తిమీద సాములా మారింది.
జగన్ సర్కార్‌కు ముడేళ్లు, సీపీఎస్ రద్దు చేస్తారా ?
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రభుత్వ కమిటి ఉద్యోగులతో ఇదివరకే సమావేశం అయింది. జీపీఎస్ అంశం తెర మీదకు తెచ్చారు. ఈ అంశంపై చర్చించేందుకు మరో సారి ఈ నెల 25 సమావేశానికి హజరు కావాలని ఉద్యోగ సంఘాలకు పిలుపు వచ్చింది. సీపీఎస్ రద్దు, జీపీఎస్ అంశంపై ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వ కమిటి నుంచి ఆహ్వనం అందింది. మే 25న సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. మరి ఈ సమావేశం తరువాత అయినా పూర్తి స్దాయి క్లారిటి వస్తుందా లేక, మరో సారి సమావేశం పేరుతో కాలయాపన జరుగుతుందా అనేది తెలియాలంటే బుధవారం సాయంత్రం రాత్రి వరకు వేచి చూడాల్సి ఉంది. మరోవైపు సీఎం జగన్ దావోస్ పర్యటనలో ఉండటంతో సీపీఎస్ రద్దు, జీపీఎస్ పై నిర్ణయం వెనక్కి తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: YS Jagan Davos Tour: దావోస్‌లో ఏపీ ధగధగలు, హై ఎండ్ టెక్నాలజీ హబ్‌గా విశాఖ - రెండోరోజు హైలైట్స్ ఇవే