Worm in Food: తిరుపతిలో ఆహారంలో ఓ వ్యక్తికి విషపూరిత జెర్రి కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. తిరుపతిలోని లీలామహల్ లో ఉన్న PS4 లో ఈ ఘటన జరిగింది. తినే ఆహారంలో జెర్రి కనిపించడంతో కస్టమర్ అక్కడికక్కడే ఆందోళన చేశాడు. ఈ విషయంలో ఆహార భద్రత అధికారులకు సమాచారం ఇవ్వడంతో మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారి తనిఖీలు చేపట్టారు. ఆహారంలో జెర్రి కనిపించిన తాలుకు వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తిరుమల బైపాస్ రోడ్‌లో ఈ పీఎస్ 4 రెస్టారెంట్ ఉంది. 


తండ్రి కూతురిపై యువకుల దాడి 


మద్యం మత్తులో యువకుల హల్ చల్ కలకలం రేపింది. తిరుపతి జిల్లా రేణిగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని గుత్తి వారి పల్లిలో ఘటన జరిగింది. గుత్తి వారి పల్లిలోని జాతర చూసుకొని తిరిగి ద్విచక్ర వాహనంలో వస్తుండగా తండ్రి కూతురుపై దాడి చేశారు. దాడి చేసిన యువకులు గాజులుమన్యం గ్రామానికి సంబంధించిన వారని తెలిసింది. ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులను చూసి యువకులు పరారయ్యారు.