తిరుపతికి చెందిన డాలర్స్ గ్రూప్ అధినేత డాలర్ దివాకర్ రెడ్డిపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. డాలర్స్ కంపెనీకి తిరుపతిలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థగా పేరుంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దివాకర్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాతో పాటు ఆయన బంధువులకు సంబంధించిన ఇళ్లలోనూ ఏక కాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. 


దీనిపై డాలర్ దివాకర్ రెడ్డి స్పందించారు. ఇన్ కమ్ టాక్స్ కి సంబంధించి తాను ప్రతి రూపాయి కట్టానని, ఇంతవరకు ప్రభుత్వానికి పన్ను కట్టకుండా పోయిన సందర్భాలు లేవని డాలర్ దివాకర్ రెడ్డి అన్నారు. గత 13 సంవత్సరాలుగా టాక్స్ ఎగ్గొట్టిన సందర్భాలు లేవు. అత్యంత ఎక్కువ టాక్స్ కట్టిన వ్యక్తిని నేనే. తిరుపతిలో ఇంత చిన్న వయసులో హైయెస్ట్ టాక్స్ పేయర్ గా నేనే ఉన్నాను. నిన్న రొటీన్ గా ఆదాయపు పన్ను శాఖ వారు జనరల్ చెకింగ్ కి వచ్చారు. గత రెండు రోజులుగా అధికారులు  సోదాలు జరిపారు. ఇందులో రాజకీయ కోణం ఉందా లేదా అనేది ఇప్పటిదాకా అయితే నాకు తెలియదు. ఇందులో రాజకీయ కోణం గురించి నాకు తెలియదు దాని గురించి నేను ఇప్పుడు స్పందించలేను. నేను ఏ పార్టీ వ్యక్తిని కాదు. నేను అన్ని పార్టీలతో కలిసి ఉంటాను. నేనెప్పుడూ మంచి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను. 


పేద ప్రజలకి ఏ కష్టం వచ్చినా ముందున్న వ్యక్తి నేనే. నిత్యం నేను సేవలు చేస్తూ ఉంటాను. ఈ రెండు రోజులు జరిపిన ఆదాయపు పన్ను శాఖ సోదాల్లో ఎటువంటి పత్రాలు లేదా డబ్బులు సీజ్ చేయలేదు. ఆదాయపు పన్ను శాఖ వారు ఇప్పటిదాకా మా డాక్యుమెంట్ సంబంధించిన అకౌంట్లు బ్యాంక్ స్టేట్మెంట్ లావాదేవీలు అన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. మా ఆఫీస్ లో ఉన్న సిస్టమ్స్ లాప్ టాప్స్ అన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించారు. డాలర్స్ గ్రూప్ ఆదాయపు పన్ను శాఖ రెండు రోజులుగా జరిపిన సోదాల్లో ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఈ రెండు రోజులు జరిగిన సోదాల్లో మొత్తం చెక్ చేసుకొని ఏమీ లేదని నిర్ధారించి వెళ్లారు. నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు నేను ఏ పార్టీలో చేరతానని ఎక్కడా ప్రకటించలేదు.


నేను గత 13 సంవత్సరాలుగా డాలర్స్ గ్రూప్ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తగా ఉన్నాను. ఈ రెండు రోజులు ఆదాయపు పన్ను శాఖ జరిపిన సోదాల్లో అన్ని కరెక్ట్ గా ఉన్నాయని నిర్ధారించుకొని వెళ్లారు. సాధారణ రీతిలోనే సోదాలు జరపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ నిబంధనల ప్రకారం వాళ్లు సోదాలు చేసుకొని వెళ్లారు. ఆదాయపు పన్ను శాఖ యాక్ట్ ప్రకారం అన్ని సోదాలు చేసుకొని వెళ్లారు. ఈ సోదాలు వైఎస్ఆర్సీపీ నేతలు చేయిస్తున్నారా లేదా ఇంకెవరైనా అనే విషయం నాకు ఇంకా తెలియదు. 


గత రెండు రోజులుగా నేను ఐటీ అధికారులకి సహకరిస్తున్నాను. నా మొబైల్స్ అన్ని వాళ్ళ దగ్గరే ఉండడం వల్ల నాకు ఎటువంటి విషయాలు తెలియదు. డాలర్స్ గ్రూప్ అనేది రాయలసీమలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ. మా సంస్థ ఎదగడం కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇలాంటి సోదాలు ఎన్ని జరిగినా మాకు ఏం భయం లేదు. నాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కర్ణాటక, తమిళనాడు అన్నిచోట్ల నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. తెలంగాణలో జరిగే ఎలక్షన్ కి వీటికి ఎటువంటి సంబంధం లేదు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాదాపు 30 మంది సిబ్బంది దాకా ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఇతర ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు ఉన్నారు. అందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలని చూస్తారు. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ పదిమందికి సాయం చేస్తూ ఉంటాను కాబట్టి పదిమంది కళ్ళు మా పైనే ఉంటాయి’’ అని దివాకర్ రెడ్డి స్పందించారు.