ఆగస్టు 18న శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల
Tirumala Special Darshan Tickets: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. తిరుమలలో శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్ల విడుదలపై టీటీడీ ప్రకటన చేసింది. ఆగస్టు 18న (గురువారం) 9 గంటలకు స్పెషల్ దర్శనం టికెట్లను టీటీడీ (Tirumala Tirupati Devasthanams) విడుదల చేయనుంది. అక్టోబర్ కోటాకు సంబంధించిన టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌‌సైట్‌లో అందుబాటులో ఉంచనుంది. ఈ మేరకు భక్తులను అలర్ట్ చేసింది టీటీడీ. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను వివిధ స్లాట్లలో ఇవ్వనున్నట్లు ఆలయ నిర్వాహఖ అధికారులు వెల్లడించారు. 


ఆగస్టు 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు 
ఆగస్టు 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి ఇటీవల తెలిపారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో సర్వదర్శనం మాత్రమే ఉంటుంది. అక్టోబర్‌ నెలలో బ్రహ్మోత్సవాలు జరిగే తేదీల్లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నిలిపివేసినట్లు టీటీడీ అధికారులు ఇదివరకే వెల్లడించారు. తిరుమల కొండ భక్తజనంతో నిండి పోయింది. దీంతో టీటీడీ యాత్ర సదన్, కల్యాణ కట్ట, అన్నదాన సత్రం, లడ్డూ వితరణ కేంద్రం, అఖిలాండం, ఇతర యాత్రా ప్రదేశాలు వంటి ప్రాంతాల్లో భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేలాది సంఖ్యలో‌ భక్తులు వివిధ మార్గాల ద్వారా ఒక్కసారిగా కొండకు చేరుకోవడంతో సామాన్య భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాలను టీటీటీ మరమ్మతులు చర్యలు చేపట్టడంతో ఉన్న గదులనే భక్తులకు కేటాయిస్తున్నారు అధికారులు. 
సిఫార్సు లేఖలు రద్దు .. 
సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆగస్టు 21వ తేదీ వరకు సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలను రద్దు చేశామన్నారు. భక్తుల ఇబ్బందులను టీటీడీ దృష్టిలో ఉంచుకొని భక్తులు అధికంగా రద్దీ ఉన్న ప్రాంతాల్లో పుడ్ కౌంటర్లు ఏర్పాటు చేసి అల్పాహారంతో పాటు పాలు, మజ్జిగ అందిస్తుంది‌. సామాన్య భక్తులకు పెద్ద పీఠ వేస్తూ శుక్రవారం, శనివారం, ఆదివారం రోజుల్లో‌ సిఫార్సు లేఖలను రద్దు చేస్తూ నిర్ణయం‌ తీసుకుంది. కేవలం ప్రోటోకాల్ భక్తులకే పరిమితం చేసింది. ఇక ఆన్లైన్ ద్వారా మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం పొందిన భక్తులకు మూడు గంటల సమయంలోనే స్వామి వారి దర్శనం లభించగా, సామాన్య భక్తులకు రద్దీని బట్టి సగం రోజుకు పైగా సమయం పడుతుంది. స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు‌ వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో పాలు, అల్పాహారం వితరణ కార్యక్రమాన్ని టీటీడీ చేపడుతుంది. శని, ఆదివారాలు కావడంతో‌ స్వామి వారి దర్శనం అధికంగా చేరుకునే అవకాశం ఉంది. సప్తగిరులు భక్తులతో కిటకిట‌ లాడడంతో పాటుగా భక్తుల షాపింగ్ లతో దుకాణాలు కూడా రద్దీగా మారింది. 


Also Read: Tirumala: టీటీడీలో టిక్కెట్ల మోసం - ఇంటి దొంగతో పాటు, మరో ఐదు మంది దళారులు అరెస్టు 


Also Read: TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం