Tirupati News: తిరుమల అంటే శ్రీ వేంకటేశ్వర స్వామి... స్థానిక ఆలయాలు... తిరుపతి అందాల గురించి తెలుసు కానీ టీటీడీలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. టీటీడీలో ఎన్నికలు ఏంటీ అని అనుకుంటున్నారా?


తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిత్యం లక్షల మంది భక్తులు తరలివస్తారు. ఆ భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ శాశ్వత ఉద్యోగులు... కాంట్రాక్టర్ ఉద్యోగులు... శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఉద్యోగులు సుమారు 16వేల మంది పని చేస్తున్నారు. ఇలా వీరే కాకుండా పారిశుద్ధ్య కార్మికులు ఏజెన్సీ కూడా పని చేస్తుంటుంది. వీరంతా తిరుమల, తిరుపతిలోని టీటీడీ అనుబంధ కార్యాలయాలు, ఆలయాలు, విద్య, వైద్య కేంద్రాల్లో పని చేస్తున్నారు.


శాశ్వత ఉద్యోగులకు ఎన్నికలు 
టీటీడీలో ప్రస్తుతం 7వేల మంది శాశ్వత ఉద్యోగులు పని చేస్తున్నారు. గతంలో 16వేల మంది పని చేసే వారు. ఇక్కడ పనిచేసే ఉద్యోగులు సౌకర్యార్థం కో ఆపరేటివ్ సొసైటీ సహకారంతో టీటీడీ ఎంప్లాయిస్ బ్యాంకు ( టీటీడీ ఉద్యోగుల కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ) 1939 జులై 7 న ప్రారంభించారు.


Also Read: తిరుమ‌ల శ్రీవారి ఆలయం గురించి 10 ఆసక్తికర విషయాలు


పూర్వం టీటీడీ ఈవో అధ్యక్షుడు
పంప్లాయిస్ బ్యాంకుకు సంబంధించి పూర్వం 9 మందిని ఉద్యోగులు పాలకవర్గంగా ఎన్నుకునే వారు. అధ్యక్షుడిగా టీటీడీ ఈవో, అకౌంట్ ఆఫీసర్, వెల్ఫేర్ ఆఫీసర్ నామినేటెడ్‌ పదవుల్లో ఉండవాళ్లు. 6 మంది ఉద్యోగులను డైరెక్టర్లుగా సహచర ఉద్యోగులు (బ్యాంకు ఖాతా కలిగిన) వారు ఓటింగ్ విధానంలో ఎన్నుకునే వాళ్లు. ఇలా ఎన్నుకున్న పాలకవర్గం 5 సంవత్సరాల కాలం ఉంటుంది. క్రమంగా రాష్ట్ర కో ఆపరేటివ్ సొసైటీ ద్వారా కొన్ని నిబంధనలు మార్పారు. టీటీడీ ఈవో సైతం బ్యాంకు పాలకవర్గం నుంచి బయటకు రావడంతో ఆరుగురు ఉన్న డైరెక్టర్ల సంఖ్య 7కి పెంచి ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్ అమలు చేశారు. ఉద్యోగుల ద్వారా ఎన్నికైన ఏడుగురి డైరెక్టర్లు నుంచి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కోశాధికారి, డైరెక్టర్లుగా కొనసాగుతారు. అకౌంట్ ఆఫీసర్, వెల్ఫేర్ ఆఫీసర్‌గా ఉంటారు. 


త్వరలో నోటిఫికేషన్ 
గతంలో 2019లో టీటీడీ ఎంప్లాయిస్ బ్యాంకు ఎన్నికల జరిగాయి. నాటి పాలకవర్గం చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఎన్నికల సందడి టీటీడీలో నెలకొంది. జిల్లా కో ఆపరేటివ్ సొసైటీ ఎన్నికల అధికారిణి కూడా పని ప్రారంభించారు. ఆమె అన్నింటిని పరిశీలించిన తర్వాత త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఇప్పటికే ప్యానల్ సభ్యులు పలువురు ప్రచారంలో దూసుకుపోతున్నారు. సుమారు 20 నుంచి 30 మంది సభ్యులు పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. టీటీడీ లాంటి సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఇప్పుడు ఎన్నికల బిజీలో ఉంటున్నారు. 


Also Read: అభిమాని మృతి, వారి కుటుంబానికి రూ. 5 లక్షల సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్