కలియుగ వైకుంఠనాధుడు కొలువైయున్న సప్తగిరులకు ప్రయాణం సాగించే ఘాట్ రోడ్డులు భక్తుల ప్రాణాలు హరిస్తున్నాయి. తిరుమల ఘాట్ రోడ్ల ప్రయాణంపై డ్రైవర్లకు అవగాహన లోపించడం, ఫిట్ నెస్ లేని వాహనాల్లో కొండకు రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. నిర్లక్ష్య డ్రైవింగ్, వేగ నియంత్రణ పర్యవేక్షణ కొరవడటం, స్పీడ్ డ్రైవింగ్ కారణంగా గత రెండు నెలలుగా తరచూ ఘాట్ రోడ్డులో ప్రమాదాలకు గురై శ్రీనివాసుడి భక్తులు గాయాల పాలు అవుతుండగా, కొందరు భక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు.
తిరుమలకు విచ్చేసే భక్తులు అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గం గుండా నడుచుకుంటూ వస్తే, మరికొందరేమో తిరుపతి నుండి ఘాట్ రోడ్డు మార్గంలో వాహనాల్లో దాదాపు 18 కిలో మీటర్లు పాటు రోడ్డు ప్రయాణం చేసిన తర్వాత తిరుమలకు చేరుకోవాల్సి ఉంటుంది. దీనినే రెండోవ ఘాట్ రోడ్డుగా పిలుస్తారు. ఈ ఘాట్ రోడ్డులో పెద్దగా మలుపులు లేక పోయినా, అప్పుడప్పుడు వాహనాలు లోపం కారణంగా చిన్నపాటి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ రెండోవ మార్గంలో 11 కిలో మీటర్ నుండి 17 కిలోమీటర్ మధ్య ఎయిర్ పిన్స్ స్లోప్ట్ ఎక్కువగా ఉండడం కారణంగా, రాక్ పొజిషన్ గెట్టిగా లేక పోవడం కారణంగా అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రమాదాలతో పాటుగా,భారీవర్షాలు కురిసిన సమయంలో కొండ చరియలు విరిగి పడేవి. ఈ సమస్యకు ఇటీవల్ల టిటిడి శాశ్వత పరిష్కారం చూపింది.
1961లో రెండోవ ఘాట్ రోడ్డు నిర్మాణంకు టిటిడి శ్రీకారం చుట్టగా, 1973లో వరకూ నిర్మాణ పనులు సాగగా, 1974వ సంవత్సరంలో సెప్టెంబరు 03న రెండోవ ఘాట్ ను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక తిరుమల నుండి అలిపిరి చేరుకోవడానికి భక్తులు దాదాపు 19 కిలోమీటర్లు మేర ప్రయాణం చేయాల్సి ఉండగా, ఈ మొదటి ఘాట్ రోడ్డులో మొత్తం మార్గంలో 57 మలుపులు, 36 ఎయిర్ పిన్ బెండ్స్(క్లిష్టమైన సన్నని మలుపులు) ఉన్నాయి. దీనికి కారణం అలిపిరి దగ్గర సముద్ర మట్టానికి కేవలం 150 మీటర్లు ఎత్తు ఉండగా శిఖరంపైకి పోయేటప్పటికి సుమారు 976 మీటర్ల ఎత్తు ఉంటుంది. దీని నిర్మాణం పూర్తయిన నాటి నుండి దాదాపు 30 ఏళ్ల పాటు తిరుమలకు రాకపోకలు ఈ ఘాటు ద్వారా మాత్రమే జరిగాయి. ఈ ఘాట్ రోడ్డును స్వాతంత్ర్యం రాక మునుపే సరిగ్గా 1945లో ఈ మొదటి ఘాట్ రోడ్డు మార్గంను టిటిడి నిర్మించింది.. ఐతే అప్పట్లో పెద్దగా వాహనాలు లేకపోవడంతో కేవలం ఎద్దుల బండ్లతోనే రాకపోకలు సాగించేవారు.
భక్తుల సంఖ్య ఏటా పెరుగుతూ రావడంతో అదే స్ధాయిలో తిరుమలలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. రెండోవ ఘాట్ రోడ్డులో రోజుకు పది వేల వాహనాలు వస్తుంటే, మొదటి ఘాట్ రోడ్డులో ఎనిమిది నుండి తొమ్మిది వేల వాహానాలు వెళ్తుండగా, తిరుమలలో దాదాపు ఇరవై వేల వాహానాలు తిరుగుతూ ఉంటాయి. ఇలా భక్తుల రద్దీ పెరిగే కొద్ది వాహనాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. దీంతో తరచూ వాహనాల ప్రమాదాలు గురి కావాల్సి వస్తొంది. గత రెండేళ్లుగా ఘాట్ రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చేందడంతో టిటిడి అప్రమత్తంమైంది. టీటీడి భద్రత అధికారులు ప్రమాదాల నివారణ కోసం అంటూ ఘాట్ రోడ్డులో పెట్రోలింగ్ వాహనాలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రయాణ సమయంపై కఠిన నిభంధనను అమలులోకి తెచ్చారు.
ఘాట్ రోడ్డులో వన్ వే ఉన్నప్పటికి, వేగ నియంత్రణతో పాటు ప్రమాదాల నివారణకు టీటీడి తిరుమల నుండి తిరుపతి చేరుకోవడానికి 48 నిమిషాలు, తిరుపతి నుండి తిరుమలకు చేరుకోవడానికి 28 నిమిషాలు ప్రయాణం సాగించాలని నిభందన విధించింది.. సమయం కన్నా ముందే వస్తే ఆ వాహనాలను మూడు నెలల పాటు ఘూట్ రోడ్డులో తిరగనీయకుండా నిషేధం విధంచే విధంగా నిభంధనలను అమలలోకి తెచ్చింది. ఐతే మొదట్లో నూతన విధానాని కఠినతరంగా అమలు చేసిన అధికారులు కాలక్రమేణా ఈ నిబంధనలను అమలు చేయడంపై శ్రద్ద తగ్గించారు. పర్యవేక్షణ లేకపోవడంతో వేగనియంత్రణ లేక తిరిగి గత కొద్ది కాలంగా ఘాట్ రోడ్డులో తరుచు వాహనాలు ప్రమాదాలకు గురి అవుతూ వస్తుంది.. మొదటి ఘాట్ రోడ్డులో నిర్లక్ష్య డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఘాట్ రోడ్డుపై అవగాహన లేక పోవడం, అతివేగం కారణంగా తరచూ వాహనాలు ప్రమాదాలకు కారణం అవుతున్నట్లు టిటిడి అధికారులు అంచనాకు వచ్చారు.