AP EAPCET Results 2023: ఏపీ ఈఏపి సెట్ 2023 ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు. జేఎన్టీయూ అనంతపురం ఈ సెట్‌ను నిర్వహించింది. గత  నెల 15 నుంచి  24  వరకు  ఏపీ  ఇంజినీరింగ్ , అగ్రికల్చర్  ఫార్మసీ  అడ్మిషన్‌ల కోసం ఎంట్రన్స్  పరీక్షలు విద్యార్థు రాశారు.


మే 15 నుంచి 19 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్, మే 22, 23 తేదీల్లో అగ్రికల్చర్/ఫార్మసీ విభాగాలకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 3.15 లక్షల మందికి (93.38 శాతం) పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్ విభాగంలో 2,24,724 మంది; ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగాల్లో 90,573 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.


పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను మే 24న విడుదల చేశారు. అదేవిధంగా మే 24 నుంచి 26 వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించారు. ఇంజినీరింగ్  ఎంట్రన్స్  కోసం  2 లక్షల  38  వేల  180  మంది  రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందులో బాలికలు 1 లక్ష  69  వేల  302  మంది  ఈ విభాగంలో మొదటి పది ర్యాంకుల్లో అబ్బాయిలే సత్తా చాటారు. 


ఇంజినీరింగ్‌లో మొదటి పది  ర్యాంకర్‌లు
చల్లా ఉమేష్ వరుణ్- 158  మార్కులు 
అభినవ్ చౌదరి- 157 మార్కులు 
నండిపాటి  సాయి దుర్గా రెడ్డి -155 మార్కులు
చింతపాటి  బాబు  సృజన్‌  రెడ్డి- 155మార్కులు
దుగ్గినేని  వెంకట  యోగేష్- 150 మార్కులు
అడగడ్డ  వెంకట  శివరాం  - 153 మార్కులు
ఎక్కింటి  ఫణి  వెంకట  మనిచంద్రా  రెడ్డి 153 మార్కులు
మెడపురం  లక్ష్మి  నరసింహ  భరద్వాజ్ 153 మార్కులు
శశాంక్  రెడ్డి- 152 మార్కులు
ఎం శ్రీకాంత్- 152 మార్కులు


అగ్రికల్చర్‌లోటాప్‌ ర్యాంకర్లు


సత్యరాజ జశ్వంత్‌ (కాతేరు)


వరుణ్‌ చక్రవర్తి (శ్రీకాకుళం)


రాజ్‌కుమార్‌ (సికింద్రాబాద్‌)


సాయి అభినవ్‌ (చిత్తూరు)


కార్తికేయరెడ్డి (తెనాలి)