Tirumala News: మేనిఫెస్టోను దాచుకున్న ప్రబుద్ధుడు చంద్రబాబు నాయుడు అని, ఏపీలో ముందస్తు‌ ఎన్నికలు రావడం లేదని ఏపీ కార్మిక శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు. ఆలయం వెలుపలకు వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి భావితరాల భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎంకి నిండుగా ఆశీస్సులు ఇవ్వాలని, ఏపీ రాష్ట్రానికి మళ్లీ మళ్లీ జగన్మోహన్ రెడ్డే సీఎం కావాలని స్వామివారిని వేడుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు కుయుక్తులు, కుట్రలు ప్రజలు చూస్తూనే ఉన్నారని, ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రాలేని నాయకుడిగా చంద్రబాబు మిగిలిపోయారన్నారు. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం 2.25 లక్షల కోట్ల రూపాయలు డిబిటి రూపేనా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చారన్నారు. చంద్రబాబు మాటలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని,‌ అధికారం ఉన్న సమయంలో ఒక మాట, అధికారం లేనప్పుడు మరో మాట చెప్పే వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. మేనిఫెస్టోను సైతం దాచుకున్న ప్రబుద్ధుడు చంద్రబాబు అన్నారు. మేనిఫెస్టోను భగవద్గీతగా, కురాన్ గా, బైబిల్ గా సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని తెలిపారు. 




పవన్ చేసేది నారాహీ యాత్ర..!


పేదలకు ఇల్లు ఇస్తుంటే డెమోక్రాసికల్ ఇన్ బ్యాలెన్స్ వస్తుందని చంద్రబాబు కోర్టుకు వెళ్లారని, కుల ప్రస్తావనలతో రాజకీయాలు చేయాలనే ఆలోచనలతో చంద్రబాబు ఉన్నారని.. జగన్ ముందు అవన్నీ పటా పంచలు అవ్వాల్సిందేనన్నారు. మోసాలు చేసేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు కళ్లు లేని కబోధులని విమర్శించారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం చంద్రబాబు హయాంలో భారత దేశంలో నాలుగో స్థానంలో ఉందని, చంద్రబాబు హయాంలో వెలివవేతలు, అన్యాయాలు అక్రమాలే జరిగాయన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు లేవని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కునేందుకు వైసీపీ సిద్ధంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ చేసేది వారాహి యాత్ర కాదని, నారాహీ యాత్ర అని మంత్రి మేరగు నాగార్జున మండిపడ్డారు.


శ్రీవారి సేవలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి..


చంద్రబాబు నాయుడు కోటీశ్వరులను, భూ కబ్జాదారులను, వెన్నుపోటు దారులను నమ్ముకున్నాడని ఏపీ డిప్యూటీ నారాయణ స్వామి విమర్శించారు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయక మండలంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి దేవుడిని పేదలను నమ్మితే, చంద్రబాబు నాయుడు కోటీశ్వరులను, భూ కబ్జాదారులను, వెన్నుపోటు దారులను నమ్ముకున్నాడని విమర్శించారు. రాబోయే మహా సంగ్రామంలో పేదలకు, పెత్తందారులకు యుద్ధం జరగబోతుందని, ప్రజలకు నిస్వార్ధమైన సేవ ఎవరు అందిస్తారో, వారు విజయ బాటలో నడుస్తారని, ఎవరైతే దుర్మార్గంగా అక్రమంగా నిలుస్తారో స్కీములపై కడుపు మండి బాధ పడుతున్నారో వారిని ప్రజలు తిరస్కరిస్తారని చెప్పారు..