ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం రోజుకూ వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ప్రతిరోజూ కోట్ల రూపాయాలు స్వామి వారికి కానుకలుగా సమర్పిస్తుంటారు. కానీ ఈ మధ్య కాలంలో వెంకటేశ్వరస్వామి దర్శనం సామాన్యులకు నరకప్రాయం అయిందని, స్థానిక సామాజిక వేత్తలు మాంగాటి గోపాల్ రెడ్డి, జగన్నాథం నాయుడు, సుధాకర్ రెడ్డి, కన్నారెడ్డి, పార్థసారధిలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక సామాజిక వేత్తలు తిరుపతి ప్రెస్ క్లబ్‌లో గురువారం మీడియాతో మాట్లాడారు.. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి పర్వదినాలలో స్వయంగా శ్రీవారి దర్శనానికి వెళ్లి క్యూ కాంప్లెక్స్ లో వీరు అనుభవించిన నరకాన్ని మీడియా ముందు వెల్లడించారు. గతంలో వైకుంఠ ఏకాదశి అంటే రెండు రోజులు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కలుగజేసే వారని, కానీ నేడు పది రోజులు ఏకధాటిగా దర్శనాలు కల్పిస్తామని, గొప్పలు చెప్పి వీఐపీల సేవలో తరిస్తూ క్యూ కాంప్లెక్స్ లలో భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడారని ఆరోపించారు. టీటీడీ పాలకమండలి యాజమాన్యం అసలు హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారా లేక వేరే మతాన్ని ప్రోత్సహిస్తున్నారా అని ప్రశ్నించారు.
ఈ ఏకాదశి పర్వదినాలలో టోకెన్లు కట్టుకున్న వారిని ఉసిగొలిపేలా రన్నింగ్ క్యూ అని ప్రచారం చేసి, జన భక్తసంద్రం తరలివచ్చేలా చేసి వారి అనారోగ్యానికి కారుకులయ్యారని దుయ్యబట్టారు. తిరుపతిలో ఉచిత దర్శనాల కోసం దాదాపు తొమ్మిది కౌంటర్లను ఏర్పాటు చేసి టోకలను జారీ, దర్శన భాగ్యం కల్పించే కోణంలో పూర్తిగా టీటీడీ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఐపీల సేవలో పడి గంటల తరబడి సామాన్యులను క్యూ కాంప్లెక్స్ పడవేయడం దారుణమన్నారు స్వామి వారి దర్శనానికి వెళ్లిన ఎందరో స్థానికులు కథలు కథలుగా వారి కష్టాలను చెప్పుకుంటున్నారన్నారు. అధికారులు ఇకనైనా తీరు మార్చుకొని, మరోసారి ఇది పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని డిమాండ్ చేశారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
బుధవారం ఒక్క రోజే 68,855 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 21,280 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించగా.. స్వామి వారికి 3.61 కోట్ల రూపాయలు హుండీ ఆదాయం లభించింది. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని 7 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు లేని భక్తులకు దాదాపుగా 24 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది.
శ్రీవారి ఆలయంలో ప్రతినిత్యం వైఖానస భగవచ్చాస్త్ర ప్రకారం అనేక వైదిక కైంకర్యాలు నిర్వహిస్తూ ఉంటారు అర్చకులు. శ్రీవారి ఆలయంలో ప్రతి నిత్యం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారములు తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద ధనుర్మాసం సందర్భంగా గోదాదేవి రచించిన పాసురాళ్లను జియ్యంగార్లు పఠించారు. వైఖానస అర్చకులు, సన్నిధి గొల్లలు, జియ్యంగార్లు స్వామివారి సన్నిధిలోకి ప్రవేశించి స్వామివారి తొలి దర్శనం చేసుకుంటారు. బంగారు వాకిలి వద్ద వేంకటేశ్వరుని సుప్రభాతం స్తోత్రం, ప్రవర్తి, మంగళ శాసనం వంటివి పటిస్తూ ఉండగా సన్నిధిలో వైఖానస అర్చకుల ప్రత్యూష కాలరాతనలో భాగంగా శ్రీవారికి మొదటి నివేదనగా పచ్చి పాలను నివేదిస్తారు. అంతకుముందు రోజు రాత్రి పావళింపు సేవలో బంగారు నవారు మంచంపై సేవించి ఉన్న శ్రీవారి కౌతుక బేరం భోగ శ్రీనివాసమూర్తి వారిని మూలవిరాట్ పాదాల వద్ద ఉంచి సింహాసనంపై జీవ స్థానంలో వేయించేపు చేస్తారు. అనంతరం ఏకాంతంగా శ్రీవారికి కర్పూర నిరాజనం సమర్పణ జరుగుతుంది. దీనికే కైకర్యపరుల హారతి అని కూడా పిలుస్తారు.