తిరుమల: తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్‌ మైదానంలో టీటీడీ ఈవో జె.శ్యామ‌ల‌రావు జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ భద్రతా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది. ఎవిఎస్‌వో వై.స‌తీష్‌ కుమార్ పెరేడ్‌ కమాండర్‌గా వ్యవహరించారు. అనంతరం టీటీడీ ఈవో ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత విధుల్లో ఉత్తమసేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన 36 మంది అధికారులు, 267 మంది ఉద్యోగులకు, ఎస్వీబీసీలో 7 మంది ఉద్యోగులకు 5 గ్రాముల శ్రీ‌వారి వెండి డాలర్‌, ప్రశంసాపత్రం అందజేశారు.


టీటీడీ నిఘా, భద్రతా విభాగం ఆధ్వర్యంలో జాగిలాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డాగ్‌ స్క్వాడ్‌ ఇన్‌చార్జి అమ‌ర్‌నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది. విరాట్‌, శింబా, బ్యూటీ అనే జాగిలాలు పాల్గొన్నాయి. ఇందులో గ్రూప్‌ డ్రిల్‌, పేలుడు పదార్థాలను, మాదక ద్రవ్యాలను గుర్తించడం, సైలెంట్‌ డ్రిల్‌, వస్తువులను జాగ్రత్తగా కాపాడడం, పారిపోతున్న సంఘ విద్రోహులను గుర్తించి నిలువరించడం తదితర ప్రదర్శనలను జాగిలాలు ఇచ్చాయి.



Tirumala: 36 మంది అధికారులు, 267 మంది ఉద్యోగులకు శ్రీ‌వారి వెండి డాలర్‌, ప్రశంసాపత్రం


సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థినులు “ భవతు భారతం…”,  “ అమ్మమ్మ ఏమమ్మ…”, “సారే జహాసె అచ్ఛా హిందుస్తాన్ హమారా హమ్ బుల్ బులే హై ఇస్…..” తదితర దేశభక్తి గీతాలకు చ‌క్క‌టి నృత్యం ప్ర‌ద‌ర్శించారు. ఈ కార్యక్రమానికి శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు డా. వి.కృష్ణవేణి, వ్యాఖ్యాతగా వ్యవహరించారు.


రాష్ట్రంలోనే తిరుపతిని, అగ్రగామి జిల్లాగా నిల్పడమే ద్యేయంగా కృషి చేస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.


తిరుపతి పోలీస్ పేరెడ్ గ్రౌండ్స్ లో రిపబ్లిక్ డే వేడుకలు


76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తిరుపతి పోలీస్ పేరెడ్ గ్రౌండ్స్ లో వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిదులుగా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, కమిషనర్ మౌర్య హాజరయ్యారు కాగా,కలెక్టర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు.ఆతర్వాత జాతీయ గీతాన్ని అలపించి,దేశ భక్తిని చాటుకున్నారు.అనంతరం పోలీసు సిబ్బంది కవాతు ప్రదర్శన, జాగిలాల ప్రదర్శన, విద్యార్థుల నృత్య ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఎంతగానో అబ్బురపరిచాయి.ఆతర్వాత వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ అధికారులకు,సిబ్బందికి ప్రతిభా పురస్కారాలు అందించారు.


Also Read: Andhra Pradesh: శాఖలవారీగా మంత్రుల పనితీరుపై నివేదికకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు, వారిలో మొదలైన టెన్షన్