వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక రెండున్నర ఏళ్లలో 99 శాతం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చారని, ఆ ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదే అని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఇవాళ ఉదయం (డిసెంబరు 29) తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఆర్.కే.రోజా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చినా ఆమె మీడియాతో మాట్లాడారు.
జగన్మోహన్ రెడ్డి వన్ టైం సెటిల్మెంట్ పథకం ద్వారా పేదలకు సొంత ఇంటి కల సహకారం చేశారని అన్నారు. తమ ఉనికి కాపాడుకునేందుకే టీడీపీ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆమె విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ తీరు హస్యాస్పదంగా ఉందని, బీజేపీ, టీడీపీలపై ప్రజలు ఆగ్రహంతో ఉంటే కాషాయ పార్టీ జనాగ్రహ సభలు నిర్వహించడంపై ప్రజలు నవ్వుకుంటున్నారని ఆరోపించారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయడం, పోలవరానికి కావాల్సిన నిధులు కేటాయించడంలో బీజేపీ వైఫల్యం చెందిందని అన్నారు. ఎన్ని విపత్తులు వచ్చినా కుంటీ సాకులు చెప్పకుండా ప్రజలకు సంక్షేమ పధకాలను సీఎం జగన్ అందిస్తున్నట్లుగా ఆమె తెలియజేశారు. ప్రజలకు అండగా ఉన్న ఏకైన సీఎం జగనే అని, కేవలం జగన్‌పై బురదజల్లేందుకే రాష్ట్రం అప్పుల్లో ఉందని ప్రతిపక్షాల వ్యాఖ్యలు చేస్తున్నాయని అన్నారు.
Also Read: వాషింగ్ మెషిన్‌లో ఇంటి తాళాలు.. అయినా దర్జాగా చోరీ చేసి, అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే..?
టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నాయకులు ఇచ్చిన స్క్రిప్ట్‌ను బీజేపీ నాయకులూ చదువుతున్నారని విమర్శించారు. సీఎం జగన్ పుట్టిన రోజు నాడు ఓ గ్రామాన్ని దత్తతకు తీసుకోవడం మనస్సుకు సంతృప్తి ఇచ్చిన విషయం అని రోజా అన్నారు. ఆ ఊరిని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దే ప్రయత్నం చేస్తానని రోజా హామీ ఇచ్చారు.
సినీ ప్రముఖులు కోరడం వల్లే ఆన్‌లైన్ టికెటింగ్: రోజా
మధ్య, దిగువ మధ్య తరగతి వారే ఎక్కువగా సినిమాలకు వస్తారని వారికి భారంగా ఉండకుండా ఫిక్స్‌డ్ రేట్లు ఉండేలా ప్రభుత్వం చేసిందని అన్నారు. చిన్న సినిమాలు, చిన్న నిర్మాతలకు ప్రభుత్వ నిర్ణయంతో ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. పెద్ద బడ్జెట్ సినిమాలు, పెద్ద నిర్మాతలకు ఇబ్బంది ఉండడంతో వారు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. వారికి అనుకూలంగా చర్చలు జరిగే అవకాశం ఉంది. ‘‘ఏ సినిమా వచ్చినా ఒకటే ధర అధికంగా ఉంటే చిన్న సినిమాలు బతకలేవు. సినీ ప్రముఖులు ప్రభుత్వంతో జరిపే చర్చలు సఫలం అవుతాయని ఆశిస్తున్నా. సీఎం జగన్ ఫ్రెండ్లీ సీఎం. గతంలో నాగార్జున, చిరంజీవి వంటి సినీ ప్రముఖులు కోరినందువల్లే ప్రభుత్వం తరపున ఆన్‌లైన్ టికెటింగ్ విధానం ఏపీలో పెట్టారు. వారి కోరిక మేరకే చేశారు. ఇప్పుడు పొలిటికల్ గేమింగ్ కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. జరగబోయే చర్చల్లో మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాను’’ అని ఎమ్మెల్యే రోజా తెలిపారు.
Also Read: Online Betting: ఫోన్‌లో ఈ పద్ధతిలో గేమ్స్ ఆడుతున్నారా? జాగ్రత్త.. ! ఇతనివి రూ.6.7 లక్షలు హాంఫట్
Also Read: Anandayya Medicine: ఆనందయ్య ఒమిక్రాన్ మందుకు ఎదురుదెబ్బలు, ప్రభుత్వం నుంచే.. పంపిణీ సాగేనా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి