జనవరి 13 నుంచి 22 వరకు వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతివ్వనున్నామని.. అదనపు ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.  అయితే ఒమిక్రాన్  కారణంగా దర్శనాల సంఖ్య పెంచలేదనే విషయాన్ని భక్తులు గుర్తుంచుకోవాలని చెప్పారు. దర్శన టికెట్లు లేని భక్తులను తిరుమలకు అనుమతించమని కూడా ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఈ విషయం గుర్తుపెట్టుకుని భక్తులు సహకరించాలని కోరారు. వైకుంఠ ఏకాదశి రోజున రాత్రి 2 గంటలకు స్వామి వారి దర్శనం ప్రారంభం అవ్వనున్నట్టు చెప్పారు. 


భక్తులు అధిక సంఖ్యలో దర్శనానికి వచ్చి.. ఒమిక్రాన్ వ్యాప్తికి కారణం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. రోజుకు 45 వేలమంది శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. 5 వేల సర్వ దర్శనం టోకెన్లను తిరుమల, తిరుపతి స్థానికులకు జారీ చేయనున్నట్టు చెప్పారు. దర్శన టికెట్లు లేని భక్తులను తిరుమలకు అనుమతించమని.. వచ్చి ఇబ్బందులు ఎదుర్కొవద్దని కోరారు. 


వైకుంఠ ఏకాదశి రోజున రాత్రి 2 గంటలకు దర్శనాలు ప్రారంభమవుతాయని చెప్పారు. అంతేగాకుండా.. భక్తులు కొవిడ్ నెగిటివ్, టీకా సర్టిఫికెట్లు తప్పనిసరిగా తీసుకురావాలని ధర్మారెడ్డి సూచించారు. కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. సామాన్య భ‌క్తుల సౌక‌ర్యాన్ని దృష్టిలో ఉంచుకుని జ‌న‌వ‌రి 1వ తేదీ, వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13 నుంచి 22వ తేదీ వ‌ర‌కు స్వయంగా వ‌చ్చే ప్రముఖుల‌కు మాత్రమే వీఐపీ బ్రేక్ ద‌ర్శనం క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌ని, వీఐపీ సిఫార్సు లేఖ‌లు స్వీక‌రించ‌మని టీటీడీ ప్రకటించింది. దర్శనానికి వచ్చే భ‌క్తులు కోవిడ్ వ్యాక్సినేష‌న్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ త‌ప్పనిస‌రిగా తీసుకురావాల‌ని తెలిపింది. శ్రీ‌వారి ఆలయంలో జ‌న‌వ‌రి 13న వైకుంఠ ఏకాదశి, జ‌న‌వ‌రి 14న‌ వైకుంఠ ద్వాద‌శి ప‌ర్వదినాల సంద‌ర్భంగా వచ్చే భ‌క్తులకు కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ ద‌ర్శనం క‌ల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొంది. జ‌న‌వ‌రి 13 నుంచి 22వ తేదీ వ‌ర‌కు 10 రోజుల పాటు భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శనం క‌ల్పించ‌నున్నట్లు వెల్లడించింది. 


Also Read: Sun Pharma In AP: ఏపీలో సన్ ఫార్మా పెట్టుబడులు... సీఎం జగన్ తో సన్ ఫార్మా ఎండీ దిలీప్ షాంఘ్వీ భేటీ


Also Read: Spirituality: మన పాప పుణ్యాల చిట్టా రాసేవాడికీ ఆలయాలున్నాయ్..


Also Read: Baba Vanga Predictions:ఈమె కూడా బ్రహ్మంగారిలానే.. ఏం జరగబోతుందో ముందే చెప్పేస్తుంది..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి