విజయవాడ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వంగవీటి రాధాకృష్ణపై రెక్కీ నిర్వహించిన ఆరోపణలు రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ రెక్కీ విషయాన్ని మంత్రి కొడాలి నాని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ముఖ్యమంత్రి వంగవీటి రాధకు టూ ప్లస్ టూ గన్‌మెన్లు ఇవ్వాలని ఆదేశాలు  జారీ  చేశారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు నలుగురిని ఆయన భద్రత కోసం పంపించారు. కానీ వంగవీటి రాధాకృష్ణ మాత్రం తనకు గన్‌మెన్లు అవసరం లేదని తిప్పి పంపేశారు. తనను అభిమానులే కాపాడుకుంటారని. వారే తనకు రక్షణ అని స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వ ఆదేశాల మీద తాము వచ్చామని ఆ గన్‌మెన్లు నచ్చ  చెప్పే ప్రయత్నం చేశారు.  కానీ వినిపించుకోకపోవడంతో పై అధికారులకు తెలిపినట్లుగా తెలుస్తోంది. 


Also Read: మందు బాబులకు గుడ్ న్యూస్.. మద్యం విక్రయ వేళలు పొడిగింపు.. న్యూ ఇయర్ కు తగ్గేదేలే అంటారేమో..


మరో వైపు వంగవీటి రాధాకృష్ణపై దాడి కోసం కొంత మంది రెక్కీ నిర్వహించారన్న ఆరోపణలను విజయవాడ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నట్లుగా కనపిస్తోంది. స్వయంగా మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వంశీ సమక్షంలోనే రాధాకృష్ణ ఆ ఆరోపణలు చేశారు... ఆ తర్వాత కొడాలి నాని సీఎం దృష్టికి వాటిని తీసుకెళ్లారు. దాంతో   పోలీసులు కూడా ఇలా రెక్కీ నిర్వహించి ఎవరా అన్నదానిపై లోతైన దర్యాప్తు  చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఎలాంటి కేసులు నమోదు చేయకపోయినా కొంత మంది అనుమానితుల్ని ప్రశ్నిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.


Also Read: ఏపీలో సన్ ఫార్మా పెట్టుబడులు... సీఎం జగన్ తో సన్ ఫార్మా ఎండీ దిలీప్ షాంఘ్వీ భేటీ


వంగవీటి రాధాకృష్ణ చేసిన ఆరోపణలపై డీజీపీ గౌతం సవాంగ్ కూడా స్పందించారు. ఆయన  చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామన్నారు. అయితే వంగవీటి రాధాకృష్ణ వ్యక్తిగతంగాఆ వ్యాఖ్యలు చేసినందున అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా వ్యాఖ్యానించారు. అయితే ఇంటలిజెన్స్ పోలీసులు ఈ అంశంపై అంతర్గతంగా ఆరా తీస్తున్నారు. నివేదిక రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 


Watch Video : వంగవీటి రాధాకు 2+2 గన్ మెన్ లు కేటాయించాలని సీఎం జగన్ ఆదేశం


Also Read: నన్ను హత్య చేసేందుకు రెక్కీ చేశారు... నేను దేనికైనా రెడీ... వంగవీటి రాధాకృష్ణ


Also Read: AP BJP : బెయిల్‌పై ఉన్న నేతలు జైలుకెళ్లడం ఖాయం... ప్రజాగ్రహ సభలో ప్రకాష్ జవదేకర్ జోస్యం !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి