ఆంధ్రప్రదేశ్‌లో కొంత మంది నేతలు బెయిల్‌పై ఉన్నారని వారంతా త్వరలో జైలుకెళ్లడం ఖాయమని భారతీయ జనతా పార్టీ నేత ప్రకాష్ జవదేకర్ జోస్ం చెప్పారు. విజయవాడలో ఏపీ బీజేపీ ఆధ్వర్వంలో ప్రజాగ్రహ సభ నిర్వహించారు. ఈ సభలో ప్రసంగించిన ప్రకాష్ జవదేకర్.. ఏపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఆంధ్రలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఊహించలేదన్నారు.  జాతీయస్థాయిలో నిర్మాణాత్మక పాలన సాగుతూంటే ఏపీలో మాత్రం దిశ, దిశ లేని పాలన సాగుతోందన్నారు. కేంద్ర నిధులతో పథకాలు అమలు చేస్తూ.. అన్నింటికీ జగన్ పేరు పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులతో ఇళ్లను నిర్మిస్తూ జగనన్న కాలనీలని ప్రచారం చేసుకుంటున్నారని అవి మోడీ కాలనీలన్నారు. పోలవరం ప్రాజెక్టుకుతాను కేంద్ర పర్యావరణ మంత్రిగా ఉన్నప్పుడే అనుమతులు ఇచ్చానని కానీ ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు. 


Also Read: మా భూమిని కబ్జా చేశారు... పసిబిడ్డతో పోలీసు స్టేషన్ ముందు భార్యభర్తల నిరసన...


అమరావతి కోసం అటవీభూములను బదిలీ చేశామని చెప్పారు. తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఏపీలో కొన్ని సమస్యలు గుర్తించానని అన్నారు. రాజధాని విషయంలో టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ  మధ్య ఘర్షణ నెలకొందని తెలిపారు. ఈ రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు.అమరావతికీ అన్ని విధాలుగా సహకరించినా పూర్తి చేయలేకపోయారన్నారు. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ మోడీ  వల్లే గెలిచిదని తర్వాత దూరం జరిగి అధికారాన్ని పోగట్టుకుందన్నారు. తాను రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరిగానని...,  టీఆర్ఎస్, టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ కుటుంబ అవినీతి పార్టీలేనని గుర్తించాన్నారు. హిందూత్వంపై దాడి జరుగుతోందని..  అందరూ ఖండిస్తున్నాప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదన్నారు. ఏపీలో ఎర్ర చందనం అక్రమ రవాణా వ్యవస్థీకృతంగా జరుగుతోందని... ప్రకాష్ జవదేకర్ పుష్ప సినిమాను ఉదాహరణగా చూపించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ పై విచారణ కోసం నియమించిన సిట్‌ను కూడా క్యాన్సిల్ చేశారని మండిపడ్డారు. బీజేపీకి ఒక్క అవకాశం ఇస్తే సుపారిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు. 


Also Read: తెలుగు ప్రజల ఆశీర్వాద బలం వల్లే ఈ స్థాయికి... ఏపీ పర్యటన చాలా సంతోషానిచ్చింది... సీజేఐ బహిరంగ లేఖ
 
 రాష్ట్రంలో మద్య నిషేధం అని చెప్పి, ఇప్పుడు మద్యంపై వచ్చే డబ్బుతోనే పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. అయోధ్యలో గొప్పగా రామాలయం నిర్మిస్తున్నామని ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. వారణాసి, చార్ ధామ్ వంటి పుణ్యక్షేత్రాల రూపురేఖలు మారుస్తున్నామని పేర్కొన్నారు. ఏపీలో పరిస్థితి బాగా లేదని, అంతర్వేదిలో రథం దగ్ధమైందని, రామతీర్థంలో స్వామివారి విగ్రహాన్ని విరగ్గొట్టారని మండిపడ్డారు. కాగా, ప్రకాశ్ జవదేకర్ ఆంగ్లంలో ప్రసంగించగా, పురందేశ్వరి తెలుగులో అనువదించారు.


Also Read: కమిటీ నివేదిక వచ్చాక తుది టిక్కెట్ ధరల ఖరారు - డిస్ట్రిబ్యూటర్ల సమావేశంలో పేర్ని నాని ప్రకటన !



ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తమకు అవకాశం ఇస్తే రాజధాని నిర్మించి చూపిస్తామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు అమరావతి రైతుల్ని రోడ్డున పడేశారని ..తిరుపతి వరకూ నడిపించారని విమర్శించారు. సోము వీర్రాజు తన ప్రసంగంలో వివాదాస్పద అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. కమ్యూనిస్టు పార్టీల నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇతర బీజేపీ నేతలు వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని ఎక్కువగా టార్గెట్ చేశారు.  కనిపించే అప్పుల కన్నా కనిపించని అప్పులే ఎక్కువగా ఉన్నాయని.. ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటిస్తే రాష్ట్రపతి పాలన తప్పదని.. బీజేపీ ఎంపీ సుజనా చౌదరి హెచ్చరించారు. కుడి చేత్తో ఇచ్చి.. ఎడం చేత్తో లాక్కుటున్నారని.. ప్రభుత్వంపై మండిపడ్డారు. కల్లిబొల్లి హామీలు ఇచ్చి మోసం చేసి ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు. 


Also Read: హిందూపురంలో డంపింగ్ యార్డ్ వివాదం.. బాలకృష్ణ ఇంటి ముట్టడితో ఉద్రిక్తత!


ఏపీ సంపద ఎక్కడికి పోయిందని ఎంపీ సీఎం రమేష్ ప్రశ్నించారు. భయపెట్టి , దాడులు చేసి.. దౌర్జన్యాలు చేసి రాష్ట్ర సంపద మొత్తం వైఎస్ఆర్‌సీపీ నేతలకు కట్టబెట్టారని సీఎం రమేష్ ఆరోపించారు.  రాష్ట్రంలో కక్ష సాధింపు తప్ప మరేమీ లేదన్నారు.  ఆంధ్రప్రదేశ్ పాలకులు తామే హత్యలు.. తామే లూఠీలు చేయించి ఇతరులపై నిందలు వేయడంలో ఆరితేరిపోయారని మరో బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. దానికి వివేకానందరెడ్డి హత్య కేసే నిదర్శనమన్నారు. 


Also Read: Movie Ticket Rates Issue: టికెట్ రేట్స్ ఇష్యూ... ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీలో సభ్యులు వీరే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి