సెంచూరియన్‌లో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. 105.3 ఓవర్లకు 327 పరుగులకు కోహ్లీసేన ఆలౌటైంది. కేఎల్‌ రాహుల్‌ (123; 260 బంతుల్లో 16x4, 1x6) శతక మోత మోగించాడు. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (60; 123 బంతుల్లో 9x4) అర్ధశతకంతో అదరగొట్టాడు. సీనియర్‌ ఆటగాడు అజింక్య రహానె (48; 102 బంతుల్లో 9x4) త్రుటిలో అర్ధశతకం చేజార్చుకున్నాడు. రాహుల్‌ ఉన్నంత వరకు అద్భుతంగా ఆడిన భారత్‌ అతడు ఔటవ్వగానే ఎంతోసేపు నిలబడలేదు. కేవలం 49 పరుగుల వ్యవధిలో ఆలౌటైంది. లుంగి ఎంగిడి 6, కాగిసో రబాడా 3 వికెట్లు తీశారు. జన్‌సెన్‌కు ఒక వికెట్‌ దక్కింది.






రెండో రోజు వర్షంతో ఆట రద్దైంది. మూడో రోజు, మంగళవారం ఓవర్‌నైట్‌ స్కోరు 272/3తో టీమ్ఇండియా బ్యాటింగ్‌ ఆరంభించింది. చల్లని వాతావరణం, పిచ్‌లో మార్పులు రావడంతో సఫారీ బౌలర్లు దానిని ఆసరాగా చేసుకున్నారు. కట్టుదిట్టమైన లెంగ్తుల్లో బంతులేసి భారత్‌ను దెబ్బకొట్టారు. 122తో బ్యాటింగ్‌కు వచ్చిన ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ మరో పరుగుకే వెనుదిరిగాడు. అర్ధశతకానికి 2 పరుగుల దూరంలో అజింక్య రహానె ఔటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 291. ఆపై సఫారీ బౌలర్లు రెచ్చిపోవడంతో రిషభ్ పంత్‌ (8), అశ్విన్‌ (4), శార్దూల్‌ ఠాకూర్‌ (4), మహ్మద్‌ షమి (8),  జస్ప్రీత్‌ బుమ్రా (14) వెంటవెంటనే పెవిలియన్‌ చేరారు.






Also Read: Sreesanth, Ranji Trophy: జెర్సీలో నానీ అరిచినట్టే..! శ్రీశాంత్‌ భావోద్వేగం


Also Read: IND vs SA, Hanuma Vihari left: మా తెలుగు ఆటగాడు చేసిన తప్పేంటి? టీమ్‌ఇండియాపై విమర్శల వర్షం!!


Also Read: England Ducks 2021: అమ్మబాబోయ్.. అన్ని డకౌట్లా.. అత్యంత చెత్త రికార్డు సాధించిన ఇంగ్లండ్! 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి