YSRCP Leader Roja: రాజకీయాల్లో ప్రస్తుతానికి రోజా యాక్టివ్‌గా లేనప్పటికీ ఆమె పేరు మాత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో మారుమోగుతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక్కసారిగా రోజా సైలెంట్ అయిపోయారు. నగరి నుంచి హ్యాట్రిక్ కొట్టి ప్రత్యర్థుల నోళ్లు మూయించాలని భావించారు. కాని రోజా ఒకటి తలిస్తే ఓటరు మరొకటి తలిచారు. ఆమెను ఓడించి అక్కడ టీడీపీ నేతను గెలిపించారు. దీంతో ఒక్కసారిగా రోజా మౌన వ్రతం పాటిస్తున్నారు. 


వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా రోజా చాలా హాట్‌ కామెంట్స్‌లో ఎప్పుడూ లైమ్‌లైట్‌ పాలిటిక్స్‌లో ఉండే వాళ్లు. ప్రత్యర్థులపై మాటల తూటాలు పేలుస్తూ తనదైన స్టైల్‌ రాజకీయం చేశారు. గతంలో కూడా చాలా సార్లు పోటీ చేసి ఓడిపోయారు. అయినా ఇంత సైలెంట్‌గా ఉన్నది లేదు. కానీ ఇప్పుడు పూర్తిగా భిన్నంగా మారిపోయారు. 


సైలెంట్‌గా ఉండటమే కాదు... వైసీపీకి కూడా అందుబాటులో ఉండటం లేదన్నది తాజాగా వినిపిస్తున్న టాక్. ఎన్నికల ఫలితాలు వచ్చిన మొదట్లో ఒకట్రెండు సార్లు జగన్‌ చేసిన రివ్యూలుక హాజరయ్యారు. తర్వాత కొన్ని ర ోజుల పాటు నగరిలో తిరిగినప్పటికీ తర్వాత అటు రావడం మానేశారని అంటున్నారు. ఎక్కువ ఫ్యామిలీతో గడుపుతున్నారు. ఆలయాలు సందర్శిస్తున్నారు. 


ఈ మధ్య కాలంలో ఓ ఫారిన్ టూర్‌కి కూడా వెళ్లి వచ్చారని సమాచారం. ఈ టైంలోనే వచ్చిన ఫొటోలతో ఆమెను ప్రత్యర్థులు ట్రోల్ చేస్తున్నారు. గతంలో చేసిన కామెంట్స్‌ ఇప్పుడు ఫొటోలతో ఆమెపై విపరీతంగా విమర్శలు చేస్తున్నారు. రాజకీయంగా ఆమె సైలెంట్‌గా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఆమె పేరుగా గట్టిగానే వినిపిస్తోంది. 


పనిలో పనిగా రోజాపై ఇంకో వార్తను కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు ప్రత్యర్థులు. ఆమె ఏపీ రాజకీయాలను వదిలేశారని తమిళనాడు రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఓ మీడియా ఛానల్ వేసిన వార్తను సర్క్యులేట్ చేస్తున్నారు. విజయ్ పార్టీలో రోజా చేరుతున్నారని ప్రచారం చేస్తున్నారు. అందుకే ఎక్కువ సమయం తమిళనాడులో ఉంటున్నారని కూడా చెప్పుకుంటున్నారు. 


మొత్తానికి రోజా రాజకీయాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా ఆమెకు మాత్రం రాజకీయాలు బ్రేక్ ఇవ్వడం లేదు. రోజూ ఏదో రూపంలో ఆమెను వెంటాడుతూనే ఉంది. పర్యాటక శాఖ మంత్రిగా పని చేసిన రోజా టీటీడీ టికెట్ల విషయంలో కూడా అక్రమాలకు పాల్పడ్డారని తరచూ టీడీపీ నేతలు ఆరోపిస్తుంటారు.