Chittoor news: రాష్ట్ర వ్యాప్తంగా అటవీ ప్రాంతంలో సమీపంలో నివసించే గ్రామాల ప్రజలకు సంవత్సరాల కాలంగా ఏనుగులు పంటలపై దాడులు చేస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇలా ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను నష్టపోయిన రైతులకు పంట పరిహారం కూడా జాప్యం ఆవుతూ వచ్చేది. దానికి పరిష్కారం చూపుతుంది కూటమి ప్రభుత్వం.


ఆహారం తినడానికి ఒకరు తపిస్తుంటే... ఆహారం కాపాడుకుని కుటుంబ పోషణ కోసం మకొక్కరు బాధపడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అటవీ పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు కూటమి ప్రభుత్వం లోని డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. పంటలను నాశనం చేస్తున్న అటవీ ఏనుల రక్షణ కోసం కుంకీ ఏనుగులను కర్ణాటక రాష్ట్రం నుంచి తీసుకొస్తుంటే... పంటలు నష్టపోయే రైతులకు నష్టపరిహారం సులభతరంగా.. త్వరగా అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. అటవీ శాఖ లోని పలుపురు దీనిపై ఇప్పటికే కసరత్తు చేసి ట్రైల్ వర్సన్ అమలు చేస్తున్నారు. త్వరలో ప్రజలకు అందుబాటులో తీసుకురానున్నారు.


ఉమ్మడి చిత్తూరు జిల్లాలో  ⁠
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో  ఏదొక్క ప్రాంతంలో ఏనుగుల దాడులు పరిపాటిగా మారింది. చిత్తూరు జిల్లా తమిళనాడు, కర్నాటక రాష్ట్ర సరిహద్దులు కావడం తో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. మూడు రాష్ట్రాల అధికారులు సరిహద్దు ప్రాంతం కావడంతో ఏనుగుల నుంచి రక్షణ చర్యలు తీసుకోవడం వదిలేసి వాటిని తమ రాష్ట్రానికి రానివ్వకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా కౌండిన్య ఆభయారణ్యం, తమిళనాడు రాష్ట్రం కరిమంగళం అటవీ ప్రాంతం, కర్ణాటక రాష్ట్రం బన్నేరుగట్ట అటవీ ప్రాంతం ఉంది. చిత్తూరు జిల్లా లో 110 ఏనుగులు, తమిళనాడు రాష్ట్రం లో 300 ఏనుగులు, కర్ణాటక రాష్ట్రం లో 400 ఏనుగులు ఉన్నట్లు మూడు రాష్ట్రాల అధికారులు చేసిన ఏనుగుల గనన ద్వారా తెలిసింది.


చిత్తూరు జిల్లా కౌండిన్య ఆభయారణ్యం 357 చదరపు కిలోమీటర్ల పరిధిలో 88,550 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ మాత్రమే ఉండే ఏనుగుల గుంపు ఇటీవల కాలంలో కుప్పం, పలమనేరు నుంచి పీలేరు, భాకరాపేట, చంద్రగిరి, సోమల, సదుం, పుంగనూరు, చౌడేపల్లి తదితర ప్రాంతాలకు వెళ్తున్నాయి. ఈ ఏనుగుల గుంపును గుర్తించి అక్కడి స్థానికులు, అటవీ శాఖ అధికారులు అటవీలోకి మళ్లించేందుకు చర్యలు తీసుకుంటామని చేబుతున్నారు. అయితే అడవులు తగ్గిపోవడం.. చెట్టు నరికేయడం, నీరు అడవిలో లేకపోవడం ఇలా వివిధ రకాల కారణాలతో ఏనుగులు పంటల పై పడుతున్నాయి.


యాప్ తో పంట పరిహారం


అటవీ శాఖ కొత్తగా యాప్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఏనుగులు ఏ ప్రాంతంలో ఉన్నాయని తొలుత గుర్తించి నిరంతరం వాటిని పర్యవేక్షిస్తారు. అందుకు కావాల్సిన సామాగ్రిని ఉపయోగిస్తున్నారు. ఏనుగులు పంట వైపు రాకుండా చర్యలు తీసుకుంటారు. పంటల పై ఏనుగులు దాడులు చేస్తే అక్కడ పంట నష్టం కలిగిన రైతులకు నష్టపరిహారం సులభతరంగా త్వరగా అందేలా చూసేందుకు GAJA PRAJA అనే యాప్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు.


ఇప్పటివరకు ఏనుగుల దాడుల్లో పంట నష్టం కలిగిన రైతులకు నష్టపరిహారం ఎప్పుడు వస్తుందో... వచ్చిన ఎంత వస్తుందో... దానిని ఎప్పుడు ఇస్తారో తెలియదు. అప్పులి చేసి పంటలు వేసే రైతులు పంట నష్టానికి పరిహారం రాకుండా వ్యవసాయం ఆపేయడం లేదా ప్రాణాలు తీసుకోవడం చేస్తున్న పరిస్థితులి మనం చూసాం. అలాంటి వాటికి చెక్ పెడుతూ గజా.. ప్రజా యాప్ ను తీసుకొచ్చారు.


రైతులు ఈ యాప్ ను తమ సెల్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోవాలి. ఏనుగులు దాడులు చేస్తే ఏ ప్రాంతం, ఏ పంట, ఎంత విస్తీర్ణం, ఎంత నష్టం  వాటిల్లింది అనే అంశాలను అందులోనే పొందుపరుస్తూ ఫొటోలు తీసి యాప్ ద్వారా రైతు నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుని సబ్మిట్ నొక్కిన వెంటనే అటవీశాఖ ఎఫ్ బిఓ, ఎఫ్ఎస్వో, ఎఫ్ఆర్వో, రెవెన్యూ ఆఫీసర్ డ్యాస్ బోర్డు కు కు వెళ్తుంది. సచివాలయం పరిధిలో అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ పరిశీలన చేస్తారు. ఆ తరువాత ఎఫ్ఆర్వో నుంచి డీఎఫ్వో కు దరఖాస్తులు డ్యాస్ బోర్డు కు వెళ్తుంది. దానిని నిర్థారిస్తూ డీఎఫ్వో అప్రూవల్ చేస్తారు. ఇదంతా 24 గంటల లోపు పూర్తి చేయాలి. అలా చేసిన వారం రోజుల లోపు పంట నష్టానికి తగిన ప్రభుత్వ పరిహారం రైతు వ్యక్తిగత ఖాతా లోకి జమ అవుతుంది. ఈ యాప్ ప్రస్తుతం ట్రైల్ వెర్షన్ లో ఫారెస్ట్ సిబ్బంది చేత చేపిస్తున్నారు. ఇందులో ఏదైనా సమస్య లు వస్తే వాటిని పరిష్కారం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రానున్నారు.