Chittoor Paper Factor Fire Accident: చిత్తూరు నగరంలో (Chittoor News) పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక రంగాచారి వీధిలో రెండంతస్తుల భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. మంగళవారం (సెప్టెంబరు 21) అర్ధరాత్రి 1.30 గంటలకు ఘటన జరిగింది. ఈ రెండంతస్తుల భవనంలో పేపర్ ప్లేట్లు తయారు చేయడంతో పాటు కుటుంబాలు నివాసం కూడా ఉంటున్నాయి. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వారు మంటలను అదుపు చేశారు.
రెండు ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేసినా మంటలు ఏ మాత్రం అదుపులోకి రాలేదు. అగ్ని ప్రమాదం జరిగిన గృహంలో భాస్కర్ 65, ఆయన కుమారుడు ఢిల్లీబాబు 35, మరొకరు బాలాజీ 25 ఇంటి లోపల చిక్కుకున్నారు. ఘటన స్థలం వద్ద వారి కుటుంబీకులు తమవారికి ఏమైందో అని ఆందోళనతో కన్నీరు మున్నీరయ్యారు. చివరికి వారి మృతదేహాన్ని వెలికి తీశారు. రెండవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ యతీంద్ర, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
Also Read: Delhi Crime: కోడలు పాడు పని! అత్తామామల న్యూడ్ వీడియోలు రికార్డ్ - వాటితో కన్నింగ్ స్కెచ్!
భవనం రెండో అంతస్తులో పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్ ఉంది. దానికి భాస్కర్ (65) కుటుంబం నిర్వహిస్తూ అక్కడే కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటోంది. అయితే నిన్న రాత్రి 12 గంటలకు ప్లేట్ల తయారీ యూనిట్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనంలో నుండి కేకలు వినిపించడంతో చూసిన స్ధానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించారు. కానీ మంటలు అదుపులోకి రాక పోయే సరికి అగ్ని మాపక సిబ్బంది చాలా సేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Also Read: Hyderabad News : పంజాగుట్ట కేసులో కొత్త ట్విస్ట్- గొంతు కోసినట్లు డ్రామా, తేల్చిన పోలీసులు!
పుట్టిన రోజు నాడే మరణం కూడా
భవనంలో చిక్కుకుని ఉన్న భాస్కర్ తో పాటుగా, భాస్కర్ కుమారుడు ఢిల్లీ బాబు (సాఫ్ట్ వేర్ ఉద్యోగి), అతని స్నేహితుడు బాలాజీలను స్థానికుల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది వెలికి తీసి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ముగ్గరు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో మృతుల కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగి పోయారు. ఢిల్లీబాబు పుట్టిన రోజునే ప్రమాదానికి గురై మృతి చెందాడని బంధువులు బోరున విలపిస్తుండడం స్ధానికులను కన్నీరు పెట్టించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.
Also Read: Khammam Bike Lift Case: బైక్ లిఫ్ట్ మర్డర్ కేసు ఛేదించిన పోలీసులు, వివాహేతర సంబంధమే కారణమా !
Also Read: వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి వచ్చాడు- వెళ్లేటప్పుడు ఏం చోరీ చేశాడో తెలిసి అంతా షాక్