అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలు అంగరంగవైభంగా సాగుతున్నాయి. లక్షల మంది భక్తులు తమ ఇష్టదైవాన్ని ఈ వేడుకల టైంలో చూసేందుకు భారీగా తరలి వస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ సీఎం శ్రీనివాసుడికి పట్టువస్త్రాలు సమర్పించడం అనవాయితి. అందుకే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇవాళ సంప్రదాయబద్దంగా తిరుమలేశుడికి పట్టువస్త్రాలు సమర్పించారు. 


శ్రీవారి ఆలయానికి అభిముఖంగా ఉన్న బేడీ ఆంజనేయ గుడి వద్దకు ముందుగా చేరుకున్న సీఎం జగన్... సాంప్రదాయ వస్త్రాలు ధరించి నుదుటిపై తిరునామం ధరించారు. బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద సీఎం జగన్మోహన్ రెడ్డికి పరివట్టం కట్టారు ఆలయ ప్రధాన అర్చకులయ వేణుగోపాల్ దీక్షితులు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సీఎం. జగన్ వెంట మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, ఆర్కే రోజా, ఇతర ఎమ్మెల్యేలు టిటిడి అధికారులు ఉన్నారు.






పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో 2023 నూతన డైరీ,క్యాలెండర్‌ ఆవిష్కరించారు సీఎం. ఆయనకు వేద పండితులు వేద ఆశీర్వాదం అందించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేసిన అగ్గిపెట్టిలో శ్రీవారి పట్టు వస్త్రంను అందించారు పాలక మండలి సభ్యుడు మొరంశెట్టి రాములు.


వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా శ్రీవారి ఆలయానికి చేరుకునేందుకు స్ధానిక నాయకులు పెంచులయ్య, పార్టీ నాయకులు ప్రయత్నించారు.  వాకిని ఆలయ మహాద్వారం వద్దనే అడ్డుకున్న‌ారు టిటిడి విజిలెన్స్ సిబ్బంది. దీంతో విజిలెన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు నాయకులు.