Tirumala Brahmotsavam 2025 Dates: తిరుమల వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలకు సమయం ఆసన్నమైంది. సెప్టెంబర్ 23 సాయంత్రం నుంచి అంగరంగవైభవంగా వేడుకలు మొదలుకానున్నాయి. సాయంత్రం వేళ అంకురార్పణతో సంబరాలు స్టార్ట్ అవుతాయి. ప్రతి రోజు ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు, సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వివిధ వాహనాలపై స్వామివారు భక్తులకు అభయం ఇస్తారు. వేడుకల ప్రారంభోత్సవానికి ముందు ఈ నెల 16న శ్రీనివాసుడి ఆలయంలో కోయిల్ ఆళ్వార్‌తిరుమంజనం చేపడతారు. అంటే వేడుకకు ముందు అన్నింటినీ శుభ్రం చేస్తారు.
ఏ రోజు ఏ వాహనంపై స్వామి ఊరేగుతారంటే
- సెప్టెంబర్ 23న సాయంత్రం అంకురార్పణ మాత్రమే ఉంటుంది.
- సెప్టెంబర్ 24న సాయంత్రం 5గటంల 43నిమిషాల నుంచి 6గంటల 15 నిమిషాల వరకు ధ్వజారోహణ చేస్తారు. ఇది మీన లగ్నంలో చేస్తారు. అదే రోజు రాత్రి 9 గంటలకు పెద శేష వాహన సేవ ఉంటుంది.
- సెప్టెంబర్ 25న ఉదయం 8 గంటలకు చిన శేషవాహన సేవ ఉంటుంది. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం ఉంటుంది. అంటే స్వామి వారిని ఊయలలో వేసి ఊపుతారు. అదే రోజు రాత్రి 7 గంటలకు హంస వాహనంపై స్వామి వారు అభయప్రదానం చేస్తారు.
- సెప్టెంబర్ 26న ఉదయం 8 గంటలకు సింహ వాహన సేవ ఉంటుంది. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం ఉంటుంది. రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరిలో స్వామి వారు అభయప్రదానం చేస్తారు.
- సెప్టెంబర్ 27న ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహన సేవ ఉంటుంది. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం ఉంటుంది. అదే రోజు రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనంపై స్వామి వారు ఊరేగుతారు.
- సెప్టెంబర్ 28న ఉదయం 8 గంటలకు మోహినీ అవతారంలో స్వామి వారు కనిపిస్తారు.రాత్రి 7 గంటలకు గరుడ సేవ ఉంటుంది.
- సెప్టెంబర్ 29న ఉదయం 8 గంటలకు హనుమంత వాహన సేవ ఉంటుంది. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం ఉంటుంది. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం ఉంటుంది. అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు స్వర్ణ రథంపై అదే రోజు రాత్రి 7 గంటలకు గజ వాహనంపై స్వామి వారు ఊరేగుతారు.
- సెప్టెంబర్ 30న ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనంలో స్వామి వారు కనిపిస్తారు. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహన సేవ ఉంటుంది.
- అక్టోబర్ 1న ఉదయం 7గంటలకు రథోత్సవం ఉంటుంది. రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై శ్రీనివాసుడు ఊరేగుతారు.
- అక్టోబర్ 2న ఉదయం 6గంటల నుంచి 9 గంటల వరకు చక్రస్నానం , రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకు ధ్వజారోహణ వేడుక చేపడతారు. దీంతో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు ముగుసస్తాయి.