ప్రస్తుత సమాజంలో అర్ధరాత్రి అమ్మాయిలు బయటకు వస్తే తిరిగి ఇంటికి వస్తారా..? అనే అనుమానాలు అధికం అవుతున్న పరిస్థితులు. ప్రభుత్వాలు ఎంత కఠిన చర్యలు తీసుకుంటున్నా మృగాళ్లలలో మాత్రం మార్పు రావడంలేదు. అవసరానికి రాత్రి పూట బయటకు వచ్చే మహిళలకు పూర్తిగా రక్షణ కరవుతుంది. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు అమలు చేసిన మృగాళ్లు వెనకాడటం లేదనే చెప్పొచ్చు. పోక్సో, దిశ, నిర్భయ లాంటి చట్టాలు అమలులో ఉన్నా ఆడవారికి రక్షణ కరవుతోంది. మహిళలపై అఘాయిత్యానికి పాల్పడి వారిని హతమార్చేందుకు కూడా వెనకాడడంలేదు. తాజాగా తిరుపతికి శివారు ప్రాంతంమైన మంగళంలోని ఓ కాలనీలో ఇటువంటి ఘటనే జరిగింది.
తిరుపతి శివారు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ యువతి తల్లి అనారోగ్యం కారణంగా రెండేళ్ల క్రితం మృతి చెందింది. తల్లి చనిపోయిన ఏడాదిన్నర తర్వాత తండ్రి కూడా అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ కుటుంబానికి పెద్ద దిక్కులేకుండా పోయింది. యువతి కుటుంబానికి బంధువులు ఆశ్రయం ఇచ్చారు. దీంతో ఆమె తమ బంధువుల ఇంటిలో ఉంటూ కాలం వెల్లదీస్తుంది. ఈ నెల 28వ తేదీ సాయంత్రం తిరుపతికి వెళ్లేందుకు ఆటో రిక్షా కోసం 19 ఏళ్ల యువతి మంగళం రోడ్డులో నిరీక్షిస్తూ కనిపించింది. తిరుపతికి శివారు ప్రాంతం కావడంతో అడపాదడపా ఆటోలు, ఇతర వాహనాలు వస్తూ.. వెళ్తూ ఉంటాయి. పదిహేను నిమిషాలకు ఆటో కోసం నిరీక్షించిన ఆ యువతికి ఒక్క ఆటో కూడా రాకపోవడంతో అక్కడే వేచి చూసింది. దీన్ని ఆసరాగా తీసుకున్న అదే కాలనీకి చెందిన నాగేంద్ర బాబు(30) యువతి పక్కింటి యువకుడు, తాను తిరుపతికి వెళ్తున్నానని నమ్మించి ద్విచక్ర వాహనంపై రమ్మని నమ్మబలికాడు. యువకుడు తెలిసిన వాడు కావడంతో యువతి నాగేంద్రబాబు ద్విచక్ర వాహనంపై ఎక్కింది.
కొంత దూరం వెళ్లాక ఓ దుకాణంలో కూల్ డ్రింక్ తీసుకున్న ఆ యువకుడు అందులో మత్తు పదార్ధాలు కలిపాడు. ఈ డ్రింక్ తాగిన యువతి మెల్లగా మత్తులో జారుకుంటున్న సమయంలో.. తిరుపతి బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీనివాసం వసతి భవనానికి ఎదురుగా ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నాడు. అప్పటికే ఆ యువతి మత్తులోకి జారుకోవడంతో అదే అదునుగా భావించిన యువకుడు నాగేంద్రబాబు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత యువతిని తిరిగి స్పృహ వచ్చాక మంగళానికి చేరుకుంది. మరుసటి రోజు యువతికి తీవ్ర అనారోగ్యం కావడంతో వైద్యం చేయించేందుకు ఆసుపత్రికి వెళ్లగా పరిక్షించిన వైద్యులు విషయం చె్పారు. దీంతో యువతి శుక్రవారం రాత్రి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడైన నాగేంద్రబాబును అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు.
Also Read: AP Boxite Row : తవ్వుతోంది బాక్సైటా.. లేక లేటరైటా.. ఎన్జీటీ విచారణతో ఏపీ ప్రభుత్వానికి షాకేనా..