Foreign currency deposited in TTD hundi is Lootedy Employee:  వైసీపీ హయాంలో  శ్రీవారి పరకామణి నుంచి విదేశీ కరెన్సీ ను దొంగతనం చేస్తూ రవికుమార్ అనే వ్యక్తి పట్టుబడ్డాడు. అతను పెద్దజీయర్ మఠంలో పని చేసే వ్యక్తి.  ఓ సారి నగదు తీుసుకెళ్తూ దొరికిపోయాడు. కేసు పెట్టారు. అయితే ఈ కేసును లోక్ అదాలత్‌లో టీటీడీ అధికారులు పరిష్కరించుకున్నారు. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఈ అంశాన్ని టీటీడీ చైర్మన్ కు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఓ పోలీసు అధికారి దగ్గరుండి ఈ సెటిమెంట్ చేశారని అంటున్నారు. 


చిరు ఉద్యోగికి వందల కోట్ల ఆస్తులు 


తిరుమలలోని పెద్ద జీయర్ మఠంలో పని చేసే రవికుమార్ చిరుద్యోగి.ఆయనకు పెద్ద మొత్తంలో జీతం రాదు. ఆయినా ఆయన వందల కోట్ల ఆస్తులు కూడబెట్టారు.  రవికుమార్ అనే వ్యక్తి పొట్టలో ప్రత్యేక పెట్టించుకుని విదేశీ కరెన్సీని బయటకు తరలించేవాడని భాను ప్రకాష్ రెడ్డి చెబుతున్నారు. కొన్నేళ్లుగా ఆయన రూ. రెండువందల కోట్ల విలువైన విదేశీ కరెన్సీని తరలించి ఉంటారని అంటున్నారు. పొట్టలో పెట్టించుకున్న ప్రత్యేక అర ద్వారా భద్రతా సిబ్బందిని ఏమార్చేవారని అంటున్నారు.   రవికుమార్ వ్యవహారంలో ఆయన చేసిన ఆరోపణలపై విచారణ చేయిస్తే సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఆ రవికుమార్ నిజంగానే పొట్టలో ప్రత్యేకమైన అర ఏర్పాటు చేసుకుని ఉంటే మాత్రం చిన్న విషయం కాదని అంటున్నారు.  


Also Read: Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్


దొరికిపోయిన తర్వాత తిరుపతిలోని ఆస్తులు టీటీడీపేరుపైకి బదలాయిపు 


రవికుమార్  శ్రీవారి సొమ్మును తరలిస్తూ దొరికిపోయిన తర్వాతకేసు పెట్టారు. రాజీ పేరుతో లోక్ అదాలత్ తో పరిష్కరించుకున్నాక తిరుపతిలోని ఆయన ఆస్తులను టీటీడీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. వీటి విలువ వంద కోట్ల వరకూ ఉంటుందని చెబుతున్నారు.  చెన్నైలోని ఆయనకు ఉన్న ఆస్తులను ఇతరులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.   రవికుమార్ దోచిన శ్రీవారి సంపదఎంత.. అయన దగ్గర నుంచి ఆస్తులు రాయించుకున్న వారు ఎవరు అన్నది బయటకు రావాల్సి ఉందని అంటున్నారు. 


Also Read : వ్యాపారి నుంచి రూ.7.5 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు - సిమ్ స్వాప్ స్కామ్ నుంచి జాగ్రత్త గురూ


విచారణ జరిపించాలని టీటీడీ బోర్డుపై ఒత్తిడి 


టీటీడీ బోర్డుపై ఈ ఘటనపై విచారణ జరిపించాలని తీవ్రంగా ఒత్తిడి వస్తోంది.  రవికుమార్ ఎలా విదేశీ కరెన్సీని తరలించగలిగారు.. ఎంత కాలం నుంచి అలా తరలిస్తున్నారు. వాటితో కొన్న ఆస్తులేవి అన్నదానిపై పూర్తి విచారణ చేసే అవకాశం ఉంది. రవికుమార్ ఎంతో కాలం నుంచి ఈ విదేశీ కరెన్సీని తరలించకపోతే వందల కోట్ల ఆస్తులు కూడబెట్టలేరని చెబుతున్నారు. ఈ వ్యవహారం మొత్తం వెనుక ఏముందో వెలికి తీసి భక్తులకు నిజాలుచెప్పాల్సిన అవసరం ఉందని అంటున్నారు.