Deputy CM Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చొరవతో 9 నెలల క్రితం అదృశ్యమైన యువతి ఆచూకీని రోజుల వ్యవధిలోనే పోలీసులు కనిపెట్టారు. ఇంతకీ ఇన్ని రోజులు కనిపించని యువతిని ఇంత త్వరగా ఎలా కనిపెట్టారు. ఆమెను ఎవరు తీసుకెళ్లారు. వాళ్ల బ్యాక్ గ్రౌండ్ ఏంటీ?
సామాజిక మాధ్యమాల వేధికగా యువతులతో పరిచయం పెంచుకోవడం...తియ్యని మాటలతో వలపు వల విసరడం ఆపై సన్నిహితంగా మెలిగినప్పుడు తీసుకున్న ఫొటోలు(Photos), వీడియోలు(Video) చూపించి బెదిరించడా పరిపాటిగా మారింది. నిత్యం వేలాది ఘటనలు వెలుుగుచూస్తున్నా...యువతలు మోసగాళ్ల బారీన పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా చదువుకున్న అమ్మాయిలే ఎక్కువ మంది ఈ మోసగాళ్ల చేతిలో బలైపోతున్నారు. అలా ప్రేమపేరిట బలైపోయిన ఓ యువతి అదృశ్యం కేసును ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్(Pavan Kalyan) చొరవతో పోలీసులు ఛేదించారు.
ప్రేమ పేరిట వల
భీమవరానికి(Bhimavaram) చెందిన ప్రభాకర్‌రావు, శివకుమారి దంపతులుకు ఇద్దరు కుమార్తెలు..చిన్న కుమార్తె తేజస్విని(Tejeswani) విజయవాడలోని పెధ్దమ్మ వాళ్ల ఇంట్లో ఉంటూ హోటల్ మేనేజ్‌మెంట్ కోర్స్ చేస్తోంది
అదే కళాశాలలో చదువుకుంటున్న సీనియర్ అంజాద్(Amjad) ఆమెను ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత తియ్యని మాటలతో ప్రేమ పేరిట ట్రాప్ చేశాడు. ఆ తర్వాత ఆ యువతిని తీసుకుని పారిపోయాడు. రెండేళ్ల క్రితం కూడా అంజాద్ ఇదే విధంగా ఓ యువతిని ఇన్‌స్టాలో పరిచయం చేసుకుని ప్రేమపేరిట తీసుకుని వెళ్లిపోయాడు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ జరిపి ఇద్దరిని పట్టుకుని వచ్చారు. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి యువతిని తల్లిదండ్రులు అప్పగించి...అంజాద్‌ను గట్టిగా హెచ్చరించి వదిలేశారు. అయినప్పటికీ అతని బుద్ధి మారలేదు. సామాజిక మాధ్యమాల్లో యువతులకు వలవేయడం వారిని లవ్ పేరిట ట్రాప్ చేయడం మానలేదు.
తేజస్వీనితో పరార్
తేజస్వీనిని సైతం ప్రేమపేరిట మోసం చేసిన అంజాద్...గతేడాది అక్టోబర్ 28న ఆమెను తీసుకుని హైదరాబాద్(Hyderabad) పారిపోయాడు. యువతి ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు విజయవాడ(Vijayawada)లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లేసరికి వారిరువురూ తమ ఫోన్లను అమ్మేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులకు ఆచూకీ దొరక్కుండా ఉండేందుకు కేరళ(Kerala), రాజస్థాన్(Rajasthan) వివిధ ప్రాంతాలకు తేజస్విని తిప్పుతూ ఆమెను హింసించాడు. డబ్బుల్లేకపోవడంతో ఆమె చెవికమ్మలు, బంగారు వస్తువులు అమ్మేశాడు. ముంబయి,పుణెకు వెళ్లిన ఈ జంట చివరిగా జమ్ము(Jammau) చేరుకున్నారు. బ్రతకడానికి డబ్బులు లేకపోవడంతో అంజాద్ ఓ హోటల్‌లో పనికి కుదిరాడు.
తేజస్వినికి నరకం
ప్రేమ పేరిట మాయమాటలు చెప్పి తేజస్విని తీసుకుపోయిన అంజాద్ నిజస్వరూపం కొంతకాలానికే తెలిసొచ్చింది. చేతిలో ఉన్న డబ్బులు, బంగారం అయినపోయిన తర్వాత అతని ప్రవర్తన ఏంటో తెలిసిపోయింది. ఇంట్లో వాళ్లతే మాట్లాడితే పోలీసులు పసిగట్టేస్తారని నమ్మబలికిన అంజాద్....ఆమె ఎవరితోనూ కాంటాక్ట్ కాకుండా జాగ్రత్తపడ్డాడు. ఆ తర్వాత కొత్త ఫోన్ కొనుగోలు చేసినా...ఆమెకు కనీసం ఫోన్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. కనీసం తాను ఎక్కడ ఉందో కూడా ఆమెకు తెలియనివ్వలేదు. ఊరుగాని ఊరు...భాషకూడా రాకపోవడంతో అతను చెప్పినట్లు ఆమె విన్నది. అయితే అంజాద్ ఆదమరుపుగా ఉన్న సమయంలో అతని ఫోన్ నుంచి అక్క ఇన్‌స్ట్రాగ్రామ్‌కు తేజస్విని మెసేజ్ చేసింది. పోలీసులు ఆమెతో ఛాటింగ్ చేసినా...తాను ఎక్కడ ఉన్నానన్నది కచ్చితంగా చెప్పలేకపోయింది. అయితే ఇటీవలే అమెజాన్ నుంచి తెప్పించిన ఫార్శిల్ కవర్‌పై ఉన్న అడ్రస్‌ను ఫొటో తీసి పంపించడంతో...పోలీసులు వారు జమ్మూలో ఉన్నట్లు తెలుసుకున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి తేజస్విని కాపాడారు.
పవన్ చొరవతో కదిలిన యంత్రాంగం
ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనలో పాలకుల్లో ఉంటే సమస్యలు ఎంత సత్వరం పరిష్కారం అవుతాయో చెప్పేందుకు ఈకేసే ఉదారహణ..తేజస్విని అదృశ్యమై 9 నెలలవుతుంటే తల్లిదండ్రులు తిరగని స్టేషన్ లేదు..మొక్కని అధికారి లేడు. గత ప్రభుత్వ హయాంలో ఈ కేసున పట్టించుకున్న పాపాన పోలేదు. డిప్యూటీ సీఎంగా పవన్‌కల్యాణ్(Pavan Kalyan) బాధ్యతలు చేపట్టిన తర్వాత జనసేన కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో పవన్‌కు ఆ తల్లిదండ్రులు గోడు వెళ్లబోసుకున్నారు. వెంటనే స్పందించిన పవన్ ఈ కేసు చేధించాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు రెండురోజుల్లోనే యువతీ, యువకుల జాడ కనిపెట్టారు.