ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో రూ. 243 కోట్ల స్కాం జరిగిందని ఏపీ సీఐడీ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ అంశం బయటకు రాక ముందే ఇందులో ఏ-2గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మినారాయణ ఇంటిపై సీఐడీ అధికారులు దాడులు చేశారు. రాత్రి రెండున్నర సమయంలో ఆయన ఇంటికి వెళ్లి సోదాలకు ప్ర.యత్నించారు. ఈ అంశం వివాదాస్పదమయింది. సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్న సమయంలో ఆయన బీపీ పడిపోవడంతో స్పృహ తప్పిపోయారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
Also Read : పీఆర్సీ ప్రకటించినా ఉద్యమం ఆగదు... సీపీఎస్ రద్దు చేయకుండా ప్రత్యామ్నాయాలు వద్దు...
ఏపీసీఐడీ నమోదు చేసిన కేసులో ఏ-1గా అప్పటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న గంటా సుబ్బారావు, ఏ2గా లక్ష్మీనారాయణ పేరును చేర్చారు. మొత్తం 13 మంది పేర్లను ఎఫ్ఐఆర్‌లో ఏపీ సీఐడీ చేర్చింది. డిజైన్ టెక్, సిమెన్స్ కంపెనీ పేర్లను ఏ4, ఏ5గా సీఐడీ పేర్కొంది. విచారణ సందర్భంగా ఆస్పత్రి పాలవడంతో లక్ష్మీనారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 13న విచారణకు హాజరుకావాలని నోటీసులలో పేర్కొంది.
Also Read: ఇక కొత్త లేఅవుట్లు వేస్తే 5% స్థలం ఇవ్వాల్సిందే.. లేదా ఇలా చేయొచ్చు, ప్రభుత్వం సంచలన నిర్ణయం
రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మినారాయణ ఇంటిపై సీఐడీ అధికారులు నిబంధనలకు విరుద్దంగా దాడులు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో రూపాయి కూడా అవినీతి జరగలేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టం చేశారు. అవినీతి జరిగిందని విచారించాలనుకుంటే... డైరక్టర్‌గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మినారాయణకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఆయన ఏ చెల్లింపులకైనా సంతకం పెట్టారా..? ఒక్కడే ఏ నిర్ణయం అయినా తీసుకున్నారా..? బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
Also Read: కర్నూలులో వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ .. 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరపున టీడీపీ హయాంలో 40కిపైగా నైపుణ్య అభివృద్ది కేంద్రాలు సిమెన్స్ నేతృత్వంలో ఏర్పాటు చేశారని.. దానికి ఎండీగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రేమ్ చంద్రారెడ్డి చెల్లింపులు చేశారన్నారు. అదే సమయలో రెండు కమిటీలు ఈ మొత్తాన్ని పర్యవేక్షించాయని.. ఆ కమిటీలకు ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఐఏఎస్ అధికారులు అజయ్ జైన్, రావత్‌లు నేతృత్వం వహించారని వారి సిఫార్సుల మేరకే అన్నీ జరిగాయన్నారు. మరి వారి పేర్లను ఎందుకు ఎఫ్‌ఐఆర్‌లో పెట్టలేదని ప్రశ్నించారు. అవినీతి జరిగి ఉంటే వాళ్లనే కదా ప్రశ్నించాలన్నారు. ప్రేమ్ చంద్రారెడ్డి ముఖ్యమంత్రికి సన్నిహితుడని ఆయనను ఎస్‌ఈసీ పదవికి కూడా సిఫార్సు చేశారన్నారు.
Also Read: మాస్క్ లేని వారిని రానిస్తే వ్యాపార సంస్థల మూసివేత..ఏపీ ప్రభుత్వ కొత్త కోవిడ్ రూల్స్ !
అలాగే అజయ్ జైన్, రావత్‌లు ఎప్పుడూ సీఎం ఇంట్లోనే ఉంటారని .. వారిని కాదనుకుంటా... రిటైరైపోయిన .. ఎలాంటి నిర్ణయాధికారం లేని డైరక్టర్ అయిన లక్ష్మినారాయణపై నిందలేసిఆయనను మానసికంగా క్షోభపెట్టడం ఏమిటని ప్రశ్నించారు. భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారని.. ఎలా జరిగిందో చెప్పాలని సవాల్ చేశారు. ఖర్చు చేసిన మొత్తం అవినీతి అయితే స్కిల్ డెలవప్‌మెంట్ సెంటర్లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. రాష్ట్రానికి ఏ కంపెనీలు రావడం లేదని..యువతకు ఉద్యోగాలిచ్చే పరిస్థితి లేదని.. కక్ష సాధింపుల కోసం ఇలాంటి తప్పుడు కేసులతో మరెవరూ రాకుండా చేస్తున్నారని పట్టాభిరాం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి