AP High Court Judges : ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా  ఏడుగురు కొత్త న్యాయమూర్తులను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుచేసింది. వీరందరూ న్యాయాధికారుల నుంచి హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందనున్నారు.  వెంకట రవీంద్రబాబు, రాధాకృష్ణ కృప సాగర్, శ్యామ్‌సుందర్, శ్రీనివాస్ ఊటుకురు, బోపన్న వరహ లక్ష్మీ నరసింహ చక్రవర్తి, మల్లికార్జునరావు, వెంకటరమణ పేర్లను హైకోర్టు జడ్జీలుగా కొలీజియం సిఫార్సు చేసింది. కొలీజియం సిఫార్సులను రాష్ట్రపతి ఆమోదం లభించిన తర్వాత  ప్రమాణ స్వీకారం చేస్తారు.




శ్రీలంక నుంచి రాష్ట్రాలు గుణపాఠాలు నేర్చుకోవాలని సలహలు - కేంద్రానికి బాధ్యత లేదా !?


గత ఫిబ్రవరిలోనూ ఒకే సారి ఏడుగురు న్యాయమూర్తుల నియామకం 


ఏపీ హైకోర్టులో ఫిబ్రవరి నెలలో ఏడుగురు న్యాయమూర్తులను నియమించారు.  కె. శ్రీనివాసరెడ్డి, జి రామకృష్ణప్రసాద్‌, ఎన్‌ వెంకటేశ్వర్లు, టి రాజశేఖర్‌రావు, ఎస్‌ సుబ్బారెడ్డి, సి. రవి, వి. సుజాతలను నియమించారు. ఇటీవల కొంత మంది న్యాయమూర్తులు పదవీ విరమణ చేశారు. ఇప్పుడు కొత్తగా ఏడుగుర్ని నియమించనుండటంతో న్యాయమూర్తుల సంఖ్య పెరగనుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టిన తర్వాత న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టారు. 


అక్రమాలు చేసి గెలిచేదానికి ఎన్నికలెందుకు ? తిరుపతి సహకార బ్యాంక్ ఎలక్షన్స్‌పై టీడీపీ విమర్శలు !


న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాలు పెంచేందుకు  సీజేఐ ఎన్వీ రమణ తీవ్రమైన ప్రయత్నాలు


న్యాయమూర్తుల కొరత కారణంగా వేలాది కేసులు పెండింగ్‌లో ఉండటంతో పెద్ద ఎత్తున దేశంలోని అన్ని హైకోర్టులకు విస్తృతంగా న్యాయమూర్తులను నియమించే ప్రక్రియ చేపట్టారు. సుప్రీంకోర్టులోనూ గతంలో పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉండేవి. సీజేఐ చొరవతో దాదాపుగా అన్ని ఖాళీలు భర్తీ అయ్యాయి. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచడమే కాకుండా భర్తీ కూడా చేశారు. ఏపీ హైకోర్టు కొత్తగా ఏర్పాడినా న్యాయమూర్తులను వేగంగా నియమించడానికి కృషి చేశారు. 


అంతా తెలంగాణ సర్కార్ నిర్వాకమే - ధాన్యం ఎందుకు కొనడం లేదో చెప్పిన కేంద్రం !


దేశంలో అన్ని న్యాయస్థానాల్లో వేగంగా న్యాయమూర్తుల నియామకం 


సీజేఐ ఎన్వీ రమణ పదవీ కాలం ఆగస్టు లో ముగియనుంది. ఆయన పదవీ కాలంలో కీలకమైన తీర్పులే కాకుండా సామాన్యులకు న్యాయం అందుబాటులో ఉండేలా.., న్యాయమూర్తుల కొరత లేకుండా .. కేసులు వేగంగా విచారణ జరిగేలా చేయడానికి తన వంతు కృషి చేశారు.