" ఇక్కడ సివిల్ వివాదాలు పరిష్కరించబడవు " అని ప్రతి పోలీస్ స్టేషన్ ముందు బోర్డు ఉంటుంది. సివిల్ వివాదాలు అంటే భూముల గట్టు గొడవలు, అస్తి తగాదాలు, వారసత్వపు తగాదాలు, కుటుంబ తగాదాలు సివిల్ వివాదాల కిందకు వస్తాయి. వాటిని పోలీసులు తమ అధికారంతో సెటిల్మెంట్ చేసి అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు గతంలో వచ్చాయి. ఈ కారణంగా పోలీసులు ఎవరూ సివిల్ వివాదాల్లో తలదూర్చవద్దని ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. ఒక వేళ ఎవరైనా సివిల్ వివాదంతో వస్తే వారు న్యాయస్థానంలో తేల్చుకోవాలని చెప్పాలి. అయితే అదే ప్రభుత్వం ఇప్పుడు పోలీసులు సివిల్ వివాదాలను పరిష్కరిస్తారు అని చెబితే చెల్లుతుందా..? చెల్లే చాన్స్ లేదు. కానీ ప్రభుత్వం అలాంటి ఉత్తర్వులు ఇచ్చింది. ఫలితంగా పదిహేను వేల మంది సచివాలయ ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. 


Also Read : మేనిఫెస్టోలోని హామీలు వంద శాతం అమలు చేస్తున్నాం.. కిందటి ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలు చెల్లించాం


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. అందులో మహిళా కార్యదర్శులను పరీక్ష పెట్టి నియమంచింది. అలాంటి వారు పదిహేను వేల మంది ఉన్నారు. వీరందర్నీ ఇటీవల పోలీసు శాఖలో విలీనం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అలా ఉత్తర్వులు ఇచ్చే క్రమంలో గ్రామ సచివాలయంలోని పోలీసు ఉద్యోగులుగా ఉండే  మహిళా కార్యదర్శులు సివిల్‌ వివాదాలు పరిష్కరించవచ్చునని ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే పోలీసులుగా మహిళా కార్యదర్శులను పేర్కొనడం కూడా చట్ట విరుద్ధమని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. 


Also Read:Compensation: కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం.. దరఖాస్తు చేసుకున్నాక ఎప్పటిలోగా వస్తాయంటే..


పోలీసులు సివిల్ వివాదాలు పరిష్కరించడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని ఏపీ హైకోర్టు ధర్మానసనం స్పష్టం చేసింది. అలాగే పోలీసు శాఖలో జరిగే నియామకాలన్నీ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారానే జరగాలి.  పూర్తి స్థాయిలో పోలీసులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న హోంగార్డులను కూడా పోలీసులుగా పిలువరు. ఎందుకంటే వారి నియామక ప్రక్రియ వేరుగా ఉంటుంది. సచివాలయాల్లో పని చేసే మహిళా కార్యదర్శులు ఓ పరీక్ష ద్వారా మాత్రమే ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఆ పరీక్షకు పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డుకు సంబంధంలేదు.


Also Read: Ration Shop: పోలీసుల కళ్లలో కారం కొట్టి, రాడ్‌తో దాడి చేసిన మహిళ.. ఆర్డీవో, డీఎస్పీ ముందే నానాబీభత్సం


1859 ఏపీ డిస్ట్రిక్ట్ పోలీసు యాక్ట్ కు విరుద్ధంగా  వారినందర్నీ పోలీసులుగా ప్రభుత్వం పరిగణించిందని.. పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పోలీసు విధులు మహిళా కార్యదర్శులకు ఎలా ఇస్తారో చెప్పాలని ... వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్‌ను పరిశీలించిన తర్వాత మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం పేర్కొంది. 


Also Read : ఏపీలో టీఆర్ఎస్‌ పోటీ ! ఆషామాషీగా కాదు వ్యూహాత్మకంగానే కేసీఆర్ అడుగులు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి