ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రస్తుతం వన్‌ టైం సెటిల్మెంట్ పేరుతో 1983 నుంచి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని చెల్లించని వారికి ఓ పథకం అమలు చేస్తోంది. రూ. పది, రూ. ఇరవై వేలను ప్రాంతాల వారీగా కడితే రుణమాఫీ చేస్తోంది. కొత్తగా వన్‌ టైం కన్వర్షన్ పేరుతో మరో కొత్త స్కీమ్ తీసుకు రావాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు కలెక్టర్లకు చేరాయనిచెబుతున్నారు. వన్ టైం కన్వర్షన్.., ఓటీసీ పథకం కింద వ్యవసాయ భూముల్లో ఏమైనా నిర్మాణాలు ఉంటే.. వాటికి పెనాల్టీ .. నాలా పన్ను కడితే క్రమబద్దీకరిస్తారు. 


Also Read: కరోనాతో ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది.. కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గవు


పట్టణ ప్రాతాల్లో ఇళ్లు కట్టుకోవాలంటే వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర భూములుగా కన్వర్షన్ చేయించుకోవాలి. అలా చేయించుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే అలా రియల్ ఎస్టేట్ చేయడానికి అవకాశం ఉండదు. కానీ చాలా మంది రైతులు పొలాల్లోనే ఇళ్లు, వ్యవసాయానికి అవసరమైన నిర్మాణాలు, ఫామ్‌హౌస్‌లులా కొన్ని నిర్మాణాలు చేసుకుని ఉంటూ ఉంటారు. అవి పొలంలో ఉంటాయి కాబట్టి ఎలాంటి అనుమతులు తీసుకోరు. ఇప్పుడు వాటన్నింటికీ చట్టబద్ధంగా అనుమతి ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 


Also Read: కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వరా ? ఏపీ , బీహార్ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం !


ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్ ఉండటంతో.. ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇలాంటి వ్యవసాయ భూముల్లో ఉన్న నిర్మాణాల గురించి పూర్తి సమాచారం ఇప్పటికే ప్రభుత్వం సేకరించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఈ వివరాలను బట్టి నోటీసులను జారీ చేయడానికి రంగం సిద్ధం చేసినట్లుగా అధికారవర్గాలు చెబుతున్నాయి.  నోటీసులు అందుకున్న నిర్ణీత కాలపరిమితిలో క్రమబద్దీకరించుకోకపోతే చర్యలు తీసుకోనున్నారు. వ్యవసాయ భూముల్లో ఎప్పుడు నిర్మాణం జరిగినా ఓటీసీ వర్తిస్తుందని ఆదేశాల్లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. భూ విలుపై 5 శాతం ఫెనాల్టితో నాలా పన్నుకడితే క్రమబద్దీకరిస్తారు. 


Also Read: 'టెలిప్రామ్టర్ కూడా మీ అబద్ధాలు తట్టుకోలేకపోయింది..' మోదీపై రాహుల్ సెటైర్


అయితే ఇప్పటికే ఓటీఎస్ పేరుతో చేపట్టిన పథకంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అధికారంలోకి వస్తే అన్ని ఇళ్ల రుణాలను మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు రూ. పది, రూ. ఇరవై వేలు వసూలు చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఓటీసీ పథకంపైనా తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. 



Also Read: ట్వీట్లతోనే "టెస్లా" వచ్చేస్తుందా ? ఎలన్ మస్క్ చెప్పిన "సవాళ్లేంటో" రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసా ?



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి