AP Highcourt Amaravati Cases : ఏపీ రాజధాని పిటిషన్లపై విచారణ ఆగస్టు 2వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. హైకోర్టు తీర్పు తర్వాత ప్రారంభించిన, చేపట్టిన పనుల గురించి ఏపీ ప్రభుత్వం ఓ స్టేటస్ రిపోర్టును హైకోర్టుకు సమర్పించింది. అయితే  అమరావతి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదని తాము కోర్టు ధిక్కారణ పిటిషన్ వేశామని ధర్మాసనం దృష్టికి రైతులు తీసుకెళ్లారు. ప్రభుత్వం దాఖలు చేసిన స్టేటస్ రిపోర్టును పరిశీలించిన తర్వాత ఆ పిటిషన్‌పై నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది. అదే సమయంలో ప్రభుత్వం దాఖలు చేసిన స్టేటస్ రిపోర్టుపై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్‌కు సూచించింది. రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అంగీకరించాలని ఏజీ ధర్మాసనాన్ని కోరారు. అయితే ఆ ఫైల్ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని  ధర్మాసనం తెలిపింది.   ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ సోమయాజులు, జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్‌ల నేతృత్వంలో రాజధాని పిటిషన్లపై విచారణ జరిగింది. 


ఆగని ఆన్‌లైన్ లోన్‌ యాప్‌ వేధింపులు, వివాహిత బలవన్మరణం - వాట్సప్‌లో అసభ్య మెసేజ్‌లు!


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి విషయమై ఈ ఏడాది మార్చి మూడో తేదీన ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. శాసన, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలను వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తూ శాసనం చేసే అధికారం అసెంబ్లీకి లేదని ఏపీ హైకోర్టు తీర్పును ఇచ్చింది. అమరావతిలో మౌళిక వసతులను నెల రోజుల్లోనే కల్పించాలని కోరింది. డ్రైనేజీలు, మంచినీరు, రోడ్లు ఇతర సౌకర్యాలను కల్పించాలని ఆదేశించింది. అమరావతి నిర్మాణాన్ని కొనసాగించాలని స్టేటస్ రిపోర్టును సమర్పించాలని ఏపీ హైకోర్టు ఈ ఏడాది మే 6వ తేదీన ఆదేశించింది. 


ద్రౌపది ముర్ముకు ఓటెయ్యాలని వైసీపీని కోరలేదు, సత్యకుమార్ కామెంట్స్ పై బీజేపీ అధిష్ఠానం సీరియస్!


మరో వైపు ఈ ఏడాది ఏప్రిల్ 3 లోపుగా  రైతుల ప్లాట్లలో పనులు పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కూడా హైకోర్టు ఆదేసించింది.  సీఆర్డీఏ చట్టంలో పనుల పూర్తికి మరో నాలుగేళ్లు పొడిగించామని  ప్రభుత్వం ఏపీ హైకోర్టుకు గతంలోనే నివేదించింది. 2024 జనవరి వరకు సమయం ఉందని హైకోర్టుకు తెలిపింది. హైకోర్టులో ఏపీ ప్రభుత్వం తరఫున సీఎస్ సమీర్ శర్మ  గతంలోనే అఫిడవిట్ దాఖలు చేశారు. 190 పేజీలతో కూడిన అఫిడవిట్‌ను   హైకోర్టుకు సమర్పించారు. ఇటీవల ప్రభుత్వం రాజధాని భూములను అమ్మాలని నిర్ణయించుకుంది. ఈ అంశంపైనా రైతులు కోర్టులో పిటిషన్ వేసే ఆలోచనలో ఉన్నారు