Chintamaneni : దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను ( Chintamaneni ) పోలీసులు మరోసారి హౌస్ అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి నుంచి దెందులూరులో ఉద్రిక్త వాతావరణం  ఉంది. మంగళవారం రాత్రి సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్‌లు వైసీపీ-టీడీపీ మధ్య ఘర్షణలకు దారితీసింది.  పట్టణంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు 144 సెక్షన్‌ విధించి బలగాలను మోహరించారు. అలాగే, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఆయనను ఇంట్లో నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. 


సోషల్ మీడియా కేసుల్లో చింతమనేని అనుచరుల అరెస్ట్ 


టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు  మోర్ల వరకృష్ణ, సీహెచ్‌ సాయి అజయ్‌ లను సోషల్ మీడియాలో పోస్టుల పేరుతో పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు.  వరకృష్ణకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న వైసీపీ నేతలను చూడగానే టీడీపీ కార్యకర్తల్లో ఆవేశం పెల్లుబికింది. ఒక్కసారిగా ఇరువర్గాలు కర్రలు, రాడ్లతో ఘర్షణకు దిగారు.  ఈ దాడిలో కామిరెడ్డి నాగభూషణం, కామిరెడ్డి రాజేష్‌లకు  గాయాలయ్యాయి. మరో ఇద్దరికి, వీరిని అదుపుచేసేందుకు ఎస్‌ఐ వీర్రాజుకు స్వల్ప గాయాలయ్యాయి. 


8 నెలల పాటు గడప గడపకు - 175 సీట్లు కష్టమేం కాదన్న సీఎం జగన్ !


పోలీస్ స్టేషన్ దగ్గర వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలతో టీడీపీ కార్యకర్తల ఘర్షణ 


ఏలూరు డీఎస్పీ పిదేశ్వరరావు, పోలీసుల బృందంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముందు జాగ్రత్త చర్యగా దెందులూరులో 144 సెక్షన్‌ను విధించినట్లు ఏలూరు ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు 200 మంది పోలీసులతో కూడిన బెటాలియన్‌ను దెందులూరుకు పంపారు. ఉదయం నుంచి చింతమనేని ప్రభాకర్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. 


వైఎస్ఆర్‌సీపీ కొత్త స్ట్రాటజిస్ట్ రిషిరాజ్ సింగ్ ! ఆయనెవరంటే ?


ముందు జాగ్రత్తగా దెందులూరులో 144 సెక్షన్ విధింపు


కొద్ది రోజులుగా చింతమనేని ప్రభాకర్ తనకు ప్రాణభయం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. పోలీసులు తనను ఎన్ కౌంటర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కోర్టులో కూడా పిటిషన్ వేశారు. ఇటీవల తనను చంపేందుకు ఓ షూటర్‌ను నియమించారని.. బెదిరింపు కాల్ వచ్చిందని కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వారు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆయన  ప్రభుత్వం, పోలీసులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 


పోలీసుల్ని నెట్టేసిన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, నన్ను అడ్డుకుంటారా అంటూ ఆగ్రహం