Andhra Pradesh Elections 2024 Polling percentage - హైదరాబాద్: ఏపీ, తెలంగాణలో భారీగా పోలింగ్ నమోదవుతోంది. ఎన్నికల కమిషన్ చేపట్టిన చర్యలు, అవగాహన కార్యక్రమాలు ఫలితాన్ని ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీతో పాటు లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, మధ్యాహ్నం మూడు గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 55 శాతం పోలింగ్ నమోదైంది. ఏపీలో దాదాపు 2 కోట్ల మంది ఓటర్లు తమ విలువైన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణలోనూ కోటిన్నర మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలుస్తోంది. 

  జిల్లా  3గంటల వరకు పోలింగ్ శాతం  2019లో పోలింగ్ 
1 అనంతపురం జిల్లా  52.86% 80.71%
2 చిత్తూరు జిల్లా  62.08% 84.71%
3 తూర్పుగోదావరి జిల్లా  48.28% 81.46%
4 గుంటూరు జిల్లా  52.31% 79.39%
5 కడప జిల్లా  58.95% 79.20%
6 కృష్ణా జిల్లా  59.89% 84.31%
7 కర్నూలు జిల్లా  52.73% 75.46%
8 నెల్లూరు జిల్లా 42.28% 77.56%
9 ప్రకాశం జిల్లా  42.67 % 85.78%
10 శ్రీకాకుళం జిల్లా  40.73% 75.30%
11 విశాఖపట్నం జిల్లా  33.69% 65.30%
12 విజయనగరం జిల్లా  38.46% 81.10%
13 పశ్చిమగోదావరి జిల్లా  39.60% 80.99%
14 మన్యం జిల్లా  34.99% 76.98%
15 అనకాపల్లి  37.92% 82.02%
16 అల్లూరి సీతారామరాజు  32.76% 70.20%
17 కాకినాడ జిల్లా  52.38% 78.99%
18 కోనసీమ జిల్లా  57.15% 83.93%
19 ఏలూరు జిల్లా  57.20% 83.36%
20 ఎన్టీఆర్ జిల్లా  56.18% 78.00%
21 పల్నాడు జిల్లా  40.48% 86.69%
22 బాపట్ల జిల్లా  44.28% 85.67%
23 తిరుపతి జిల్లా  39.10% 79.16%
24 అన్నమయ్య జిల్లా  39.77% 76.80%
25 నంద్యాల జిల్లా  43.66% 81.19%
26 శ్రీసత్యసాయి జిల్లా  38.12% 83.87%

ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా శాతాలు పరిశీలిస్తే... 

 
పార్లమెంట్ నియోజకవర్గం 
3గంటల వరకు నమోదైన పోలింగ్  2019లో నమోదైన పోలింగ్ 
1 శ్రీకాకుళం  పార్లమెంట్ నియోజకవర్గం  55.09శాతం   74.06 శాతం 
2 అరకు పార్లమెంట్ నియోజకవర్గం 40.85 శాతం   74.07 శాతం 
3 విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం   42.74 శాతం  80.80 శాతం
4 విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం  43.11 శాతం   66.96 శాతం 
5 అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం   52.16 శాతం  80.94 శాతం 
6 కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం    52.38 శాతం   78.99 శాతం 
7 అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం    57.15 శాతం   83.93 శాతం 
8 రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం   33.32 శాతం 81.46 శాతం 
9 నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం    39.60 శాతం  80.99 శాతం 
10 ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం   57.20 శాతం   83.36 శాతం 
11 మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం  59.89 శాతం   84.31 శాతం 
12 విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం   56.18 శాతం  78.00 శాతం
13 గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం   52.31 శాతం   79.39 శాతం 
14 నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం  56.53 శాతం   86.69 శాతం
15 బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం   59.64 శాతం   85.60 శాతం 
16 ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం   59.55 శాతం   85.86 శాతం
17 నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం   58.18 శాతం   81.19 శాతం 
18 కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం   52.73 శాతం   75.46 శాతం 
19 అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం   54.51 శాతం   80.50 శాతం 
20 హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం   55.40 శాతం   83.63 శాతం 
21 కడప పార్లమెంట్ నియోజకవర్గం   58.95 శాతం   79.20 శాతం 
22 నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం   57.78 శాతం   76.91 శాతం 
23 తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం   55.29 శాతం  79.74 శాతం
24 రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం   55.18 శాతం  78.00 శాతం 
25 చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం   61.78 శాతం   83.69 శాతం

తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్నం 3 గంటల వరకు 52.34 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా ఖమ్మంలో 63.67 శాతం పోలింగ్ అయింది. మహబూబాబాద్ లో 61.4 శాతం, కరీంనగర్ 58.24 శాతం, పెద్దపల్లిలో 55.92 శాతం, నల్గొండలో 59.91 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 

  నియోజకవర్గం 3గంటల వరకు పోలింగ్ శాతం  2019లో పోలింగ్ శాతం
1 ఆదిలాబాద్  62.44 శాతం 71.42 %
2 పెద్దపల్లి  55.92 శాతం 65.59 %
3 కరీంనగర్  58.24 శాతం 69.52 %
4 నిజామాబాద్  58.70 శాతం 68.44 %
5 జహీరాబాద్  63.96 శాతం 69.7 %
6 మెదక్  60.94 శాతం 71.75 %
7 మల్కాజిగిరి  37.69 శాతం 49.63 %
8 సికింద్రాబాద్  34.48 శాతం 46.5 %
9 హైదరాబాద్  29.47 శాతం 44.84 %
10 చేవెళ్ల  45.35 శాతం 53.25 %
11 మహబూబ్ నగర్  58.92 శాతం 65.39 %
12 నాగర్ కర్నూల్  57.17 శాతం 62.33 %
13 నల్గొండ  59.91 శాతం 74.15 %
14 భువనగిరి  62.05 శాతం 74.49 %
15 వరంగల్  54.17 శాతం 63.7 %
16 మహబూబాబాద్  61.40 శాతం 69.06 %
17 ఖమ్మం  69.67 శాతం 75.30 %

తెలంగాణలో ఒకట్రెండు చోట్ల చెదురుముదురు ఘటనలు జరిగినా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య గొడవ జరుగుతోంది. పాడేరులో, తెనాలిలో వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.