AP and TS Election 2024 Voting Percentage Till : హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నాలుగో విడత పోలింగ్ లో భారీగా ఓటింగ్ నమోదు కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఏపీ, తెలంగాణలో కలిపి దాదాపు రెండు కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40 శాతం పోలింగ్ నమోదైంది. ఏపీలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 36 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఏపీలో చెదురుమదురు ఘటనల మినహా ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. 36.84 శాతం మేర మహిళలు ఓటు వేయగా.. 35 శాతం మేర పురుషులు ఓటు వేశారు.
తెలంగాణలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.38 శాతం నమోదు కాగా, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇలా
ఆదిలాబాద్ - 50.18 శాతం
భువనగిరి - 46.49 శాతం
చేవెళ్ల - 34.56 శాతం
హైదరాబాద్ - 19.37 శాతం
కరీంనగర్ - 45.11 శాతం
ఖమ్మం - 50.63 శాతం
మహబూబాబాద్ - 48.81 శాతం
మల్కాజిగిరి - 27.69 శాతం
మెదక్ - 46.72 శాతం
నాగర్ కర్నూల్ - 45.72 శాతం
నల్గొండ - 48.48 శాతం
నిజామాబాద్ - 45.67 శాతం
పెద్దపల్లి - 44.87 శాతం
సికింద్రాబాద్ - 24.91 శాతం
వరంగల్ - 41.23 శాతం
జహీరాబాద్ - 50.71 శాతం
డోన్ నియోజకవర్గం బేతంచెర్లలో స్వతంత్ర అభ్యర్థి పిఎన్ బాబుపై వైసీపీ కార్యకర్తల దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. మంత్రి బుగ్గన కారు వెనక వెళ్తుండగా ఘటన జరిగినట్లు సమాచారం. బేతంచర్ల పోలీస్ స్టేషన్లో పీఎం బాబు ఫిర్యాదు చేశారు.
ఏపీలో ఇప్పటి వరకు (మధ్యాహ్నం 1 వరకు) 1.70 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా కడప జిల్లాలో 45.5 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 32.80 శాతం మేర పోలింగ్ నమోదు అయింది. సీఎం జగన్ పోటీ చేసిన పులివెందుల నియోజకవర్గంలో 50 శాతం పోలింగ్ అయింది. కడప తరువాత కృష్ణా, కోనసీమ, చిత్తూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లోనూ భారీగా పోలింగ్ జరిగిందని అధికారులు తెలిపారు.
ఆదోని వైసీపీ అభ్యర్థి సాయిప్రసాద్ రెడ్డిపై కేసు
ఆదోని వైసీపీ అభ్యర్థి సాయిప్రసాద్ రెడ్డిపై కేసు నమోదైంది. నింబంధనలకు విరుద్ధంగా ఓటర్ స్లిప్పులపై తన ఫోటో ముద్రించారు. దీంతో మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సాయిప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
ఓటు కోసం వచ్చి హార్ట్ ఎటాక్ తో మహిళ మృతి
ఉప్పల్ లోని ఆంధ్ర యువత మండలి పోలింగ్ కేంద్రం లో విషాదం చోటుచేసుకుంది. ఓటు వేయడానికి వచ్చిన భరత్ నగర్ కి చెందిన గట్టు విజయలక్ష్మి పోలింగ్ స్టేషన్ లో అకస్మాత్తుగా పడిపోయారు. పోలింగ్ సిబ్బంది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే హార్ట్ ఎటాక్ తో చనిపోయిందని నిర్దారించారు.