Guntur News: గుంటూరు జిల్లా తెనాలిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన ఎమ్మెల్యే శివకుమార్‌తో ఓటర్ల వాగ్వాదానికి దిగారు. సహనం కోల్పోయిన ఎమ్మెల్యే శివకుమార్ ఓ ఓటర్ చెంపపై కొట్టారు. దీంతో అక్కడ ఉన్న వాళ్లు కూడా ఎమ్మెల్యేపై తిరుగుబాటు చేశారు. దీన్ని గమనించిన ఎమ్మెల్యే అనుచరులు ఓటర్లను చితకబాదారు.
కేశినేని చిన్న టీంపై కంభంపాడులో దాడి
ఎన్టీఆర్ జిల్లాలోని కంభంపాడు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ బూత్‌ల సందర్శనకు వెళ్లిన విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని(కేశినేని శివనాథ్) బృందంబై వైసీపీ లీడర్లు దాడి చేశారు. ఆయన వస్తున్న కార్లపై రాళ్ల దాడి చేశారు.
ముందస్తు ప్లాన్ ప్రకారమే వైసీపీ శ్రేణులు దాడులు చేస్తున్నారని పోలీసులు మాత్రం నిలువరించే ప్రయత్నం చేయడం లేదని కేశినేని చిన్ని ఆరోపించారు. ఓడిపోతున్నామని తెలిసి ప్రజల్లో మద్దతు లేదని గ్రహించే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. ప్రజలంతా ఓటు వేసేలా పోలీసులు అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నారు. అక్కడ అభ్యర్థినే రాణించని వైసీపీ శ్రేణులు స్వేచ్ఛగా ఓటు వేసే ఛాన్స్ ఇస్తారా అని ప్రశ్నించారు. ఇలాంటివి ఎన్నికల సంఘం గమనించాలని విజ్ఞప్తి చేశారు.
నెల్లూరులో గడబిడ
నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలింగ్ బూత్ వద్ద వైసీపీ, టీడీపీ నాయకులు తోపులాట జరగడంతో పోలీసులు కలుగుజేసుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని శతకోడు గ్రామంలో కూడా వైసీపీ టీడీపీ నేతలు గొడవ పడ్డారు. ముందు జాగ్రత్తగా పోలీసులు కలుగుజేసుకొని గొడవ మరింత ముందిరిపోకుండా చర్యలు తీసుకున్నారు.