ఉద్యోగుల జేఏసీని వదిలేసి ఉపాధ్యాయ సంఘాలు సొంత బాట పట్టాలని నిర్ణయించుకున్నాయి. పీఆర్సీ సాధన సమితి పేరుతో ఏర్పాటయిన స్టీరింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్న టీచర్ల సంఘాల నేతలంతా రాజీనామాలు చేసారు. పీఆర్సీ పై ఎకాభిప్రాయం లేకుండానే నిర్ణయం తీసుకోవటం పట్ల ఉపాద్యాయ జేఎసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఉపాధ్యాయులను మోసం చేసేలా ఉన్న ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. విజయవాడలో ఉపాధ్యాయ సంఘ నేతలు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఎర్రజెండా వెనుక పచ్చ జెండా - ఏపీలో ఆందోళనలపై సీఎం జగన్ కామెంట్ !
మంత్రుల కమిటితో జరిగిన చర్చల్లో మెజారిటి సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం నలుగురితో సమ్మె విరమణ ప్రకటన చేయించారని ఆరోపించారు. ఫిట్‌మెంట్‌పై చివరలో మాట్లాడతాం అని.. అది పెద్ద విషయం కాదని పక్కదారి పట్టించారని ఉద్యోగ సంఘం నేతలు ఆరోపించారు. క్వాంటమ్ పెన్షన్,హెచ్ ఆర్ ఎ విషయంలో నూ నచ్చ చెప్పాలని ప్రయత్నించినా తాము తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశామన్నారు. పొరుగు రాష్ట్రం ఇచ్చిన ఫిట్ మెంట్ కు దగ్గరగా అయినా ఇవ్వాలని పట్టుబట్టినా పట్టించుకోలేదన్నారు. అందువలనే సమావేశం నుండి బయటకు వచ్చామని తెలిపారు.
మేం 1.84 లక్షల ఉద్యోగాలిచ్చాం.. ‘జగనన్న చేదోడు’ నిధుల విడుదల సందర్భంగా సీఎం వెల్లడి
మినిట్స్‌పై తాము సంతకాలు పెట్టామని సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉద్యోగ సంఘాల నేతలు ఇంతకు ముందే ఖండిచారు. నిర్ణయాలకు ఆమోదయోగ్యంగా తాము ఎటువంటి సంతకాలు పెట్టలేదని స్పష్టం చేశారు.ప్రస్తుత పీఆర్సీ వల్ల ఉపాధ్యాయులకు భవిష్యత్‌లోనూ తీవ్ర నష్టం వాటిల్లుతుందని కలసి వచ్చే సంఘాలను కలుపుకొని త్వరలో రౌంట్ టేబుల్ సమాశాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కలసి వచ్చే ఉద్యోగ సంఘాలతోనూ చర్చలు జరిపుతామని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు.
ఛలో విజయవాడ స్ఫూర్తితో ఈ నెల 10న ఛలో కలెక్టరేట్‌కు విద్యార్థి సంఘాల పిలుపు
ఉద్యోగ సంఘాల కంటే ముందుగా ఉపాధ్యాయ సంఘాలే రోడ్డెక్కాయి. చలో విజయవాడకు ముందు ఉపాధ్యాయులు కలెక్టరేట్లను ముట్టడించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయ నేతలు సీఎం జగన్‌పై పాటలు పాడటం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పుడే విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్లు ఇలా సీఎంను అసభ్యంగా దూషించడం కరెక్టేనా అని మంత్రులు విమర్శలు చేశారు. చలో విజయవాడకు తరలి వచ్చిన వారు కూడా ఎక్కువ శాతం టీచర్లేనన్న అభిప్రాయం ఉంది. దీంతో టీచర్లు ఉద్యమం ప్రారంభిస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.