Tadepalligudem  public meeting  పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి బహిరంగ సభను ఈనెల 28న నిర్వహించనున్నారు. భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లును, ప్రాంగణాన్ని జనసేన నేత నాదెండ్ల మనోహర్ శుక్రవారం పరిశీలించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో చర్చించి పలు సూచనలు చేశారు.  ఈనెల 28న ప్రత్తిపాడులో 21 ఎకరాల్లో ఉమ్మడి బహిరంగ సభ ఉంటుందని, రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ, జనసైనికులతో పాటు ప్రజలందరిని ఈ సభకు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఈ వేదికపై 175 నియోజకవర్గాల నుండి 500 మంది టీడీపీ – జనసేన నేతలు పాల్గొంటారని తెలిపారు. ఆరు లక్షల మంది ఈ సభలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని, రాజకీయ ప్రస్థానంలో ఈ సభ అద్భుతంగా ఉంటుందని అన్నారు.             

  


 టీడీపీ- జనసేన కలయిక రాజకీయ లబ్ది కోసం కాదు.. భావి తరాల అభివృద్ధి కోసం అని నాదెండ్ల మనోహర్ స్పష్టం  చేసారు.   జగన్ పరిపాలనపై విసిగిపోయిన ప్రజల గళాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వినిపిస్తారు.. పేదలకు పెత్తందార్లకు యుద్ధం అంటున్న సీఎం ఎందుకు ప్రజల సొమ్ముతో రెండు హెలికాప్టర్ లు పెట్టుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు. ఏ కారణంతో డబ్బులు వృధా చేస్తున్నారు.. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రతి పక్షాలను విమర్శించడానికి ఉపయోగించుకున్నారు అని నాదేండ్ల మనోహర్ ఆరోపించారు.               


 45 రోజుల్లో దిగిపోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాధనం వృదా చేస్తున్నారు అని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్ అని ఎద్దేవా చేశారు. రెండు పార్టీలు కలిసి నిర్వహించుకుంటున్న సభా వేదికపై అన్ని నియోజక వర్గాలకు చెందిన 500 మంది అతిథులు పాల్గొంటున్నారు.. తాడేపల్లిగూడెంలో జరగనున్న టీడీపీ- జనసేన బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అని చెప్పుకొచ్చారు. తొలిసారి జరగబోతున్న సభకు లక్షల సంఖ్యలో కార్యకర్తలు హాజరు అవుతారు అని నాదేండ్ల మనోహర్ చెప్పారు.             


కేవలం ప్రధాని రక్షణ కోసం మాత్రమే రెండు హెలికాప్టర్లను ఉపయోగించాలని చట్టం ఉంది.. దీనిపై చట్టపరంగా పోరాడుతామని నాదేండ్ల మనోహర్ తెలిపారు. జనసేన NDA లో భాగం.. అభివృద్ధి కావాలంటే కేంద్రం సహకారం అవసరం.. బీజేపీతో కలిసి వెళ్ళే విధంగా ఇంకా చర్చలు నడుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపికలో ఇప్పటికే రెండు పార్టీలకు చెందిన అధ్యక్షుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని నాదేండ్ల మనోహర్ వెల్లడించారు.                


తాడేపల్లిగూడెం  బహిరంగసభ ద్వారా .. రాష్ట్రానికి కూటమి అవసరం ఎంత ఉందో  ముఖ్య నేతలు చెప్పాలనుకుంటున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు సీట్ల సర్దుబాటు అంశంపైనా స్పందించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.